భార్య కోసం సంచలన నిర్ణయం తీసుకున్న నాగ చైతన్య

222
Akkineni Samantha who is to become a producer
Akkineni Samantha who is to become a producer

సమంత-నాగ చైతన్య ఎంత అన్యోన్యమైన జంట అనేది చాలా మందికి తెలుసు. ఈ జంట అందరికీ కపుల్ గోల్స్ ఇస్తుంది అనే టాక్ కూడా ఇండస్ట్రీ లో నడుస్తుంది. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే సమంత ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసింది కానీ ఇటీవలే చేసిన ఓ బేబీ సినిమా కి మాత్రమే విశేష స్పందన వచ్చింది. ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరించిన మాట వాస్తవం. అయితే ఈ సినిమా తో పని చేస్తున్నప్పుడే నందిని రెడ్డి దర్శకత్వం లో ఇంకో సినిమా చేయాలని సమంత నిర్ణయించుకుందట. సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమా ని నిర్మించేందుకు సిద్ధం అవుతుంది కానీ ఈ సినిమా కథ విని చైతన్య సమంత కోసం నిర్మాత గా మారాలి అని అనుకుంటున్నాడట.

సమంత కోసం ఈ సారి నందిని రెడ్డి ఒక థ్రిల్లర్ కథ ని సిద్ధం చేశారట. ఆ కథ సమంత కి చైతన్య కి పిచ్చి పిచ్చి గా నచ్చేసిందట. అందుకే చైతన్య ఎంత ఖర్చు అయినా తనే సినిమా నిర్మించి సమంత కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ గా దానిని తీర్చిదిద్దాలి అని ఆశిస్తన్నాడట. ఈ ఓ బేబీ హడావుడి ముగిశాక, ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.

Loading...