Friday, April 19, 2024
- Advertisement -

సమంత ట్వీట్ పై నెటిజన్ల ట్రోల్స్

- Advertisement -

సీనియర్ రాజకీయనాయకుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణంపై సినీ నటి సమంత చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఆమెను ట్రోల్ చేస్తూ నెటిజన్లు, నందమూరి అభిమానులు ఉతికి ఆరేస్తున్నారు. పెద్దలంటే గౌరవం లేదా ? ఇదేనా మీ పుట్టింటివారు, అత్తింటివారు నేర్పిన సంస్కారం అంటూ మండిపడుతున్నారు. పైగా ఇటీవల సమంత నితిన్ తో కలిసి నటించిన ‘అ ఆ’ సినిమాలో ఆమె చేసిన ఓ సన్నివేషాన్ని గుర్తు చేసి మరీ నెటిజన్లు సమంతపై ఫైర్ అయిపోతున్నారు. ఆ సినిమాలో అన్నపూర్ణ చనిపోయిన సన్నివేశం ఉంటుంది. అక్కడ అందరూ ఏడుస్తుంటే, సమంత నవ్వుతూ ఉంటుంది. ఆ సినిమాలో కామెడీ సన్నివేశం కోసం, సమంత క్యారెక్టర్ ఎలివేట్ చేయడం కోసం అలాంటి సీన్ తీశారు. అదంటే సినిమా, కానీ ఇది జీవితం. సినిమాల్లో చేసినట్లు ఇక్కడ చేస్తామంటే ఎలా ? అని నెటిజన్లు సమంతను ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ సమంత అంత తప్పు ఏం చేసింది ? సినిమాలో నవ్వినట్టు నవ్విందా ? అంటే అది కాదు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వార్త తెలియడంతో సమంత కూడా బాధ పడింది. అయ్యో పాపం అని విచారం వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు సమంత కూడా సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆ ట్వీటే ఆమెను టార్గెట్ చేసేలా చేసింది. ‘రిప్ హరికృష్ణ’ అని ట్వీట్ చేసింది. అంటే రెస్ట్ ఇన్ పీస్ హరికృష్ణ అని అర్ధం. అయితే హరికృష్ణ అని మాత్రమే సమంత ట్వీట్ లో సంబోధించడంపై నెటిజన్లు, నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆయనేమైనా నీ క్లాస్ మేటా ? నాకంటే వయసులో చిన్నవారా ? లేక నీ బ్యాచ్ మేటా ? వయసులో పెద్దవారిని అలా మంచీమర్యాద లేకుండా పిలుస్తారా ? గారు అని సంబోధించకుండా ట్వీట్ చేస్తారా ? అని ట్రోల్ చేస్తున్నారు. ముందు పెద్దవారిని గౌరవించడం నేర్చుకో అని నెటిజన్లు సమంతను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆమె తప్పు తెలుసుకుంది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముందు చేసిన ట్వీట్ డిలీట్ చేసేసింది. ఆ తర్వాత మళ్లీ ‘రిప్ హరికృష్ణ గారు’ అని ట్వీట్ చేసింది. హరికృష్ణ గారి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని, చెన్నైలో ఉన్న కారణంగా రాలేకపోతున్నానని చెప్పింది. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు మరో ట్వీట్ చేసింది సమంత. పొరపాటును సరి చేసుకున్నా కానీ, అప్పటికే ఆమె చేసిన రెండు ట్వీట్లు స్క్రీన్ షాట్ల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దీంతో సమంత అభిమానులు కూడా తప్పు తెలుసుకుని, సరిదిద్దుకుంది. అని చెబుతూ హరికృష్ణ మృతిపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -