Friday, April 19, 2024
- Advertisement -

డైలమా లో పడ్డ సమంత

- Advertisement -

ఓ బేబీ అనే సినిమా తో పెద్ద విజయం సాధించిన సమంత ప్రస్తుతం తన తదుపరి చిత్రం విషయం లో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అనే విషయం అర్ధం అవుతుంది. అయితే సాధారణం గా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ పోయే సమంత ఈ సరి మాత్రం చేతిలో సినిమాలు లేక ఒక డైలమా లో పడింది. ఓ బేబీ సినిమా తో ఒక మంచి కథ ని ప్రేక్షకులకి అందించింది సమంత. అదే విధం గా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ పై రికాక్ట్ అయ్యి అనవసరమైన వివాదం లో కి కూడా ఎంటర్ అయింది సమంత.

అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ చేయడం వలన, సమంత సినిమాల పైన ఎక్స్ట్రా ఫోకస్ ఉంటుంది. సమంత కూడా తన నెక్స్ట్ సినిమాల్లో ఎటువంటి అభ్యంతకర కంటెంట్, ఫెమినిస్ట్ లు పాయింట్ అవుట్ చేసే విధం గా సీన్లు లేకుండా చూసుకోవడం తప్పనిసరి. అందుకని రెగ్యులర్ కథలకి ఫుల్ స్టాప్ పెట్టి ఇక పై మంచి సినిమాలే చేయాలి అని నిర్ణయం తీసుకుంది అంట.

ఓ బేబీ విజయం కూడా సమంత పైన ఉన్న భాద్యత ని మరింత పెంచింది. అందుకే సమంత కూడా తన తదుపరి సినిమా విషయం లో ఒక క్లారిటీ తో ఉన్నట్టు అనిపించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -