Saturday, April 20, 2024
- Advertisement -

టాలీవుడ్ సీనియర్ హీరో తో కమల్ రెండో కూతురు?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో హీరోయిన్స్ కి కొరత లేదు. ఒక వైపు సీనియర్లు, మరో వైపు ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోయిన్లు.. ఇలా అందరూ ఏదో ఒక ప్రాజెక్ట్ తో తమ లక్ ని టెస్ట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా అక్షర హాసన్ తెలుగు డెబ్యూ గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తన తదుపరి చిత్రం మిస్టర్ కేకే సినిమా ప్రమోషన్స్ లో భాగం గా హైదరాబాద్ వచ్చిన అక్షర మీడియా వాళ్ళతో ముచ్చటించారు. అయితే తన తో కొంత మంది తెలుగు దర్శకులు సంప్రదింపులు జరిపారని, కానీ తను మాత్రం ఇంకా ఏ సినిమా ని అధికారికం గా ఒప్పుకోలేదు అని తెలిపింది.

అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం అక్షర హాసన్ త్వరలో ఒక సీనియర్ తెలుగు హీరో చేస్తున్న సినిమా లో కీలక పాత్ర చేయనుందట. హీరోయిన్ పాత్ర కాదు కానీ కథ లో ప్రాముఖ్యత పాత్ర కనుక అక్షర ఒప్పుకొనే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అయితే అది ఏం సినిమా అనే విషయం లో మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఒక పక్క శృతి హాసన్ కూడా తెలుగు లో పునర్వైభవం కోసం చూస్తున్న తరుణం లో అక్షర కూడా అవకాశాల కోసం చూస్తూ ఉండటం హర్షించదగ్గ విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -