బీజేపీ త‌రుపున ఆ స్టార్ హీరో ప్ర‌చారం చేస్తాడా..?

158
Akshay kumar clarity about his election campaign
Akshay kumar clarity about his election campaign

సినిమా వాళ్ల‌కు ఓట్లు ప‌డ‌తాయా అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. భార‌త‌దేశంలో రాజ‌కీయ నాయ‌కుల‌కు సినిమా వాళ్ల‌కు వీడదీయ‌రాని సంబంధం ఉంద‌ని మొద‌టి నుంచి అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ప‌లువురు సినిమా వారు సీఎంగా ప‌ని చేసిన‌వారు కూడా ఉన్నారు. తాజా భార‌త‌దేశంలో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టంతో మ‌రోసారి సినిమా హీరోలు తెర‌పైకి వచ్చారు. ప‌లు రాజ‌కీయ పార్టీలు సినిమా హీరోల‌పై ఫోక‌స్ పెట్టి వారి చేత ప్ర‌చారం చేయించుకోని ఓట్లు దండుకోవాల‌ని చూస్తున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ త‌రుపున ప్ర‌చారం చేయ‌నున్నార‌నే వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో ఓ వార్త చ‌క్కర్లు కొడుతోంది. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందించాడు అక్ష‌య్ కుమార్‌. తాను ఏ పార్టీ త‌రుపున ప్ర‌చారం చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. సినిమాల ద్వారానే తాను ప్రజలకు చేరువయ్యానని, సినిమాల ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ‘టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ, ‘ప్యాడ్ మ్యాన్ వంటి సినిమాల‌తో ప్రజల్లో మార్పును తీసుకువ‌చ్చాడు అక్ష‌య్ కుమార్‌.