Friday, April 19, 2024
- Advertisement -

నా భర్త ‘గే’ అని చెప్పారు : అక్షయ్ భార్య కామెంట్స్

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తాజాగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అక్షయ్ తో పెళ్లి ముందు జరిగిన విషయాలు చెప్పింది. అప్పట్లో తనకు కాబోయే భర్త అక్షయ్ కుమార్ ‘గే’ అని తెలిసి షాకయ్యానని చెబుతూ అందరికీ షాకిచ్చింది.

అక్షయ్ కుమార్‌తో తన పెళ్లి ప్రస్తావన గురించి ఇంట్లో చర్చ వచ్చినప్పుడు ఆయన గే అనే మాట మా అమ్మ చెప్పడంతో ఒక్కసారిగా ఏమీ తోచలేదని, మైండ్ బ్లాంక్ అయిపోయిందని ట్వింకిల్ ఖన్నా చెప్పింది. తాను, అక్షయ్ ఇద్దరం వెళ్లి తాము పెళ్లి చేసుకుంటామనే ప్రపోజల్ మా అమ్మ డింపుల్ కపాడియా వద్ద తీసుకొచ్చామని, అయితే అక్షయ్ కుమార్ వెళ్ళిపోగానే ఆయనో గే అని తన తల్లి చెప్పినట్లు ఆమె పేర్కొంది. ఆ మాట వినగానే తనకు మూర్ఛపోయినంత పనైందని ట్వింకిల్ ఖన్నా తెలిపింది.

దాంతో ఆయనను పెళ్లి చేసుకోవాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయను. అయితే ఆ టైంలో తల్లి డింపుల్ కపాడియా అతనితో ఓ ఏడాది డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకో అని చెప్పిందని.. ఆమె చెప్పినట్లుగానే సహజీవనం చేసి 2001లో అతన్ని పెళ్లాడానని ట్వింకిల్ ఖన్నా తెలిపింది. ఏది ఏమైన స్టార్ హీరో మ్యారేజ్ సీక్రెట్ బయటపెట్టడంతో బాలీవుడ్ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -