మళ్లీ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనున్న అలీ రెజా

2066
Ali Reza Re-Entry Into Bigg Boss House
Ali Reza Re-Entry Into Bigg Boss House

టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 బోలెడు ట్విస్టులతో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గత వారం ఎలిమినేట్ అయిపోయాడు అనుకున్న రాహుల్ సీక్రెట్ రూమ్ లో ఉండి ఈ మధ్యనే మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరొక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో ఒక వార్తా హల్ చల్ చేస్తోంది. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు అలీ రెజా. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు అనుకున్న అలీ రెజా ఎలిమినేట్ అయిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.

ఈ నేపథ్యంలో అలీ రెజా బయటకు వచ్చిన రోజు నుంచే అతను మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి రీ-ఎంట్రీ ఇస్తాడు అని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అలీ రెజా నిజంగానే మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి తిరిగి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి బిగ్ బాస్ వారు ఎలాంటి పోల్ నిర్వహించలేదు. మరోవైపు ఇన్ని రోజులు బయట ఉండి ప్రతి కంటెస్టెంట్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి బాగా తెలుసుకున్న అలీ రెజా బిగ్ బాస్ లోకి వెళితే బయట విషయాలు లోపల చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరికొందరు సందేహిస్తున్నారు.

Loading...