బిగ్ బాస్ 3 : అలీ, మసుమ రొమాంటిక్.. సూపర్ సీన్

1238
ali reza wife masuma to enter the house
ali reza wife masuma to enter the house

బిగ్ బాస్ ఎప్పుడు వివాదాలతో గొడవలతో నడుస్తూ ఉండేది కానీ తాజాగా భావోద్వేగంతో నిండిపోయింది. కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి వచ్చారు. వితికా చెల్లెలు హౌస్ లోకి రాగా.. తాజా ఎపిసోడ్ లో అలీ భార్య మసుమ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. ఆమె వచ్చేసరికి ఇంటి సభ్యులందరినీ స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు. దాంతో అలీ కూడా కళ్ళు మూసుకుని స్లీపింగ్ మోడ్ లో ఉండగా.. అలీ భార్య సైలెంట్ గా హౌస్ల్ కి వచ్చింది.

స్లీపింగ్ మోడ్ లో ఉన్న అలీని రాహుల్ ఆటపట్టిస్తుండగా.. మసుమ అలీ దగ్గరకు వెళ్లి తన ఒడిలో అలీ తల పెట్టుకుని ఏడ్చేసింది. ఆ తర్వాత ఆమెను శివజ్యోతి గుర్తుపట్టి బోరున తనదైన శైలీలో హౌస్ ను హడలెత్తించింది. ఆ తర్వాత మసుమ ఒక్కొక్కరిని దగ్గరకు వెళ్లి పేరు పేరునా పలకరించింది. అనంతరం బిగ్ బాస్ రిలీఫ్ అనౌన్స్ మెంట్ ఇవ్వడంతో భార్యను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు అలీ.

తర్వాత అలీతో కలిసి బిగ్ బాస్ హౌస్ మొత్తంను గమనించిన మసుమ.. బయట పరిస్థితుల్ని అలీకి వివరించింది. ’నువ్వంటే ఏంటో బయట వాళ్లకు తెలుసు. ఆల్రెడీ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావ్. ఇప్పుడు కూడా అలానే ఆడు. శివజ్యోతితో జాగ్రత్త. ఆమెతో బాడింగ్ మంచిదే.. కానీ అదే నీకు మైనస్ కావొచ్చు. గేమ్ మీదా ఫోకస్ పెట్టు.. సీజన్ కంప్లీట్ చేసి గెలిచి ఇంటికి రా.. లవ్ యూ సో మచ్, మిస్ యూ’ అంటూ అలీకి హగ్ అండ్ కిస్ ఇచ్చి మనసును భారంగా చేసుకుని భర్తను వదిలి హౌస్ నుంచి బయటకు వచ్చింది మసుమ.

అయితే మసుమ వెళ్లే టైంలో అలీని కదల్లేని స్థితిలో ఉంచారు బిగ్ బాస్. ఆమె గేట్ దగ్గరకు వెళ్లిన తర్వాత రిలీఫ్ అనడంతో పరుగున భార్య దగ్గరకు వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుని ముద్దుపెట్టి సాగనంపాడు.

Loading...