రాజమౌళి హీరోయిన్ వేసిన తెలివైన ‘యూట్యూబ్’ ప్లాన్

240
Alia Bhatt Playing New Business
Alia Bhatt Playing New Business

ఆర్ఆర్ఆర్ చిత్రం తో తెలుగు సినిమా పరిశ్రమ లో అడుగు పెడుతున్న భామ ఆలియా భట్. రాజమౌళి దర్శకత్వం లో నటించాలి అని చాలా మంది హీరోయిన్లకి నటించాలి అని ఉంటుంది కానీ అలియా కి మాత్రమే బాలీవుడ్ లో మొదటి పిలుపు అందింది. ఈ సినిమా లో రామ్ చరణ్ సరసన ఆయన భార్య పాత్ర లో నటించనుంది అలియా. ఈ సినిమా లో పాత్ర కోసం అప్పుడే ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టింది ఈ హీరోయిన్.

అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎక్కువ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ల లో ఒకళ్ళు. తనకు వచ్చే సంపాదన ని చాలా చక్కగా మానేజ్ చేస్తూ వస్తుంది అలియా. అయితే ఇప్పుడు తను ఒక కొత్త బిజినెస్ లో అడుగు పెట్టాలి అని అనుకుంటుంది అంట. అయితే ఇది ఒక వైపు బిజినెస్ లాగా, మరో వైపు పర్సనల్ ఇంట్రెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి అలియా దేనిని టేక్ అప్ చేయడానికి సుముఖత చూపిస్తుంది అని టాక్.

ఇంతకీ విషయం ఏంటి అంటే అలియా త్వరలో ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టాలి అని ప్లాన్ చేస్తుంది. తన సోషల్ మీడియా పేజెస్ కన్నా ఎక్కువ విపులం గా తన గురించి, తన లైఫ్ గురించి, తన కెరీర్ గురించిన విషయాలని ఈ ఛానెల్ ద్వారా పంచుకోవాలి అని చూస్తోంది. ఎలాగో సబ్స్క్రైబర్స్ ఎక్కువ గా నే ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద బ్రాన్డ్స్ తో టై అప్ అయ్యి డబ్బులు కూడా సంపాదించుకోవాలి అని అనుకుంటుంది అలియా.

Loading...