Saturday, April 20, 2024
- Advertisement -

డిస్కోరాజా లో అల్లరి నరేష్ ఉన్నాడా? లేడా?

- Advertisement -

మాస్ మహారాజా రవి తేజ ప్రస్తుతం ఆనంద్ దర్శకత్వం లో ఒక ఆసక్తికర చిత్రం చేస్తున్నాడు. డిస్కో రాజా అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం మీద చాలా రూమర్స్ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఈ సినిమా లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర చేయనున్నాడు అనే వార్తలు వైరల్ నేపథ్యం లో ఇప్పుడు అసలు ఈ సినిమా లో అల్లరి నరేష్ లేడు అనే వార్తలు పుట్టుకు వస్తున్నాయి.వివరాల్లోకి వెళితే ఆనంద్ ఈ సినిమా లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సునీల్ ని తీసుకుందాం అనుకున్నది నిజమేనట.

కానీ సునీల్ ఈ సినిమా లో ఉంటె ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అని అలోచించి, ప్రస్తుతం సునీల్ ట్రాక్ రికార్డ్ ని కూడా దృష్టి లో పెట్టుకొని అల్లరి నరేష్ ని తీసుకుందాం అని అనుకున్నాడట. కాకపోతే చివరికి నిర్ణయం తీసుకొనే సమయానికి రవితేజ మాత్రం సునీల్ వైపే మొగ్గు చూపాడట. అయితే హీరో సునీల్ కోసమే పట్టుబడుతుండటం తో దర్శకుడు తన ఆలోచనని తిరిగి మార్చుకోవాల్సిన పరిస్థితి ఉండటం తో ఇక ఆనంద్ కూడా సునీల్ తో ముందుకు వెళ్దాము అని అనుకునే లోపే ఈ విషయం మీడియా లో లీక్ అయిందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -