Thursday, April 25, 2024
- Advertisement -

అల్లు అరవింద్ కలలు కలలుగానే మిగిలిపోతున్నాయా

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ కూడా ఒకరు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఇప్పటికే కొన్ని క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారు. అయితే కొంతకాలంగా మిగతా హీరోలతో కంటే అల్లు అరవింద్ కేవలం తన కొడుకులిద్దరూ తోనే సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ పేరు మళ్ళీ పైకి తీసుకురావాలని అల్లు అరవింద్ కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్ అంటూ డిజిటల్ ప్లాట్ఫాం పై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ఈ జాబితాలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అల్లు అరవింద్ కి ఎప్పటినుంచో హైదరాబాద్లో కొన్ని 4డిఎక్స్ థియేటర్లు కట్టించాలని కల ఉండేది.

ఎప్పుడు త్రీడీ సినిమాలు మాత్రమే కాకుండా గాలి, మోషన్, పరిమళం వంటివి మనం కూడా ఆస్వాదించేలా గా 4 డిఎక్స్ థియేటర్లు కట్టించాలని అల్లుఅరవింద్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఒకవైపు పివిఆర్ కార్నివల్ వంటి వారు ఇప్పటికే అలాంటి థియేటర్లు కట్టేసారు కానీ అల్లు అరవింద్ కి మాత్రం ఏదో ఒక ఇబ్బంది రావడంతో ఆ ఆలోచనను మానుకుంటూ వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అల్లు అరవింద్ ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ని స్థాపించాలని అనుకుంటున్నారట. నెట్ఫ్లిక్స్, వ్యూ, జీ5 లాగానే అల్లు అరవింద్ ఒక ప్లాట్ ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఏది అనుకున్నట్టు జరగకపోవడంతో కంటెంట్ క్రియేషన్ కూడా ఇప్పుడు అల్లు అరవింద్ కి తలనొప్పిగా మారింది. అలా అల్లు అరవింద్ కలలు కలలు లాగానే మిగిలిపోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -