Thursday, April 25, 2024
- Advertisement -

ఇది నా రెండో పెళ్లి అంటున్న అల్లు బాబి

- Advertisement -

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్య మరియు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడైన అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ తాజాగా నీలు షా అనే ఒక యోగా ఇన్స్ట్రక్టర్లను పెళ్లి చేసుకున్నారు. 2005లో నీలిమ బండి అనే యువతిని పెళ్ళాడిన అల్లు శిరీష్ మూడేళ్ల క్రితం ఆమెతో విడిపోయారు. 2016 లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అల్లు బాబి గత కొంతకాలంగా నీలు షా అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఆమెను పెళ్లి చేసుకున్నాడు బాబీ.

సాదాసీదాగా జరిగిన ఈ పెళ్లి తంతు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ నేపథ్యంలో అల్లు బాబీ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. తమ పెళ్లి ఫోటోను పోస్ట్ చేస్తూ, “ఫ్రెండ్స్.. నేను పెళ్లి చేసుకున్నాను. ఇది నాకు ఒక కొత్త ప్రారంభం. నన్ను ఆశీర్వదించండి. గతంలో 2005లో నేను పెళ్లి చేసుకున్నాను. 2016 లో మేము డివోర్స్ తీసుకున్నాం. దేవుడు నాకు మూవ్ ఆన్ అయ్యి సంతోషంగా ఎలా ఉండాలో నేర్పించాడు. ఈ విషయంలో నా ఫ్యామిలీ కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది” అంటూ అల్లు బాబీ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -