Friday, April 19, 2024
- Advertisement -

భార్యను అల్లు అర్జున్ అడిగిన ఒకేఒక్క కోరిక ఇదే..!

- Advertisement -

ఇటీవలే అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా తన జీవితంలో ప్రభావితం చేసే కుటుంబ సభ్యుల గురించి కూడా చెప్పారు. మాములుగా అయితే సినిమా పంక్షన్లలో హీరోలు తమ భార్యల ప్రస్తావనే తేరు.

కానీ అందుకు భిన్నంగా అల్లు అర్జున్ మాత్రం స్నేహ ప్రస్తావన తీసుకురావటం ఆసక్తికరం. తనకు తన తండ్రి ఎంత ఇష్టమో చెప్పే క్రమంలో తన వ్యక్తిగత విషయాన్ని రివీల్ చేశారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత తనకో విషయం అర్దమైందని.. తన తండ్రి ఎంత గొప్పోడో అర్థమైందన్నారు. ఇప్పటివరకూ తన తండ్రికి తాను థ్యాంక్స్ చెప్పలేదని.. ఇప్పుడు చెబుతున్నానని చెప్పారు. తన తండ్రి అంత గోప్పోడ్ని తానెప్పటికీ కాలేనని.. మా నాన్నలో సగం అయితే చాలనేదే తన కోరికగా చెప్పారు.

పెళ్లి తర్వాత తన భార్యను తానేమీ అడగలేదని.. అడిగింది ఒక్కటేనని.. తాను తన తండ్రితోనే ఉంటానని.. తన తండ్రి అంటే తనకంత ఇష్టమని చెప్పారు. రెక్కలు వచ్చాక ఎగిరిపోవాలనే చాలా మంది అనుకుంటారు. కానీ ఈ విషయంలో అల్లు అర్జున్ గొప్పోడు అని చెప్పాలి. అల్లు అర్జున్ మాటలు వింటే.. ఇలాంటి కొడుకు కావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడేమో.. అనేలా తన తండ్రి గురించి గొప్పగా చెప్పాడు అల్లు అర్జున్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -