Thursday, April 25, 2024
- Advertisement -

సూపర్ మార్కెట్లో అల్లు అర్జున్..!

- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా 21 రోజుల లాక్‌డౌన్‌ను అమలు చేసిన విషయం తెలిసిందే. దాంతో షాపింగ్ మాల్స్, జిమ్ములు, సినిమా థియేటర్లను మూసివేయబడ్డాయి. నిత్యావసర సరుకుల షాపులు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర సేవలు అందించే వాటికి మాత్రమే అనుమతి ఇచ్చారు. మరె ఇతర కారణంగా కూడా బయటకు రావొద్దని ఆంక్షలు వింధించారు.

దాంతో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఇంటి పని, వంట పని, తోట పని చేసుకుంటూ టైం గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో స్టార్ హీరో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరుకులు కొనడానికి సూపర్ మార్కెట్ కు వచ్చాడు. పసుపు రంగు షూ, టీ షర్ట్, నల్ల రంగు షార్ట్ ధరించిన అర్జున్ ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులతో జూబ్లీహిల్స్‌లోని ఓ సూపర్ మార్కెట్లో కనిపించాడు. సాధారణ కస్టమర్ మాదిరిగా ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాడు.

మాస్కు ఉండడంతో ఆ సూపర్ మార్కెట్లో అతడిని ఎవరూ గుర్తు పట్టలేదు. కానీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలకు అల్లు అర్జున్ చిక్కిపోయాడు. దాంతో అల్లు అర్జున్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మీక హీరోయిన్ గా నటిస్తుందగా.. తమిళ హీరో విజయ్ సేతుపతి ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -