Saturday, April 20, 2024
- Advertisement -

`పుష్ప` కొత్త పోస్టర్ తో.. కథను లీక్ చేశారు..!

- Advertisement -

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ’పుష్ప’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో అల్లు అర్జున్ గెటప్ కు సంబంధించిన అధికారికంగా ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి పేరు వచ్చింది. ఇక అప్పటికే పుష్ప కథ గురించి బోలెడంత సమాచారం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. ఎర్రచందనం స్మగ్లర్ల కథాంశం ఎంచుకుని సుకుమార్ సరికొత్త రగ్గ్‌డ్ మూవీని తెరకెక్కిస్తున్నాడని ప్రచారమైంది.

చిత్తూరు శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల అరాచకాలపై సినిమా ఇది. ఇందులో బన్ని ఒక లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడని.. పోలీసులతో ఛేజ్ లు ఎటాక్ లు ఇవన్నీ ఉంటాయని.. అప్పటికే బోలెడన్ని లీక్ లు వచ్చాయి. ఈ కథను, బన్ని పాత్రను ఇమాజిన్ చేసి తాజాగా డిజైన్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఎదురొచ్చిన పోలీసోళ్లను ఏసేసి వాళ్ల జీప్ లోనే ఎక్కించి జీప్ ఫ్రంట్ టాప్ పై ఎక్కి కూచుని చుట్ట కాలుస్తున్నాడు అల్లు అర్జున్. ఈ పోస్టర్ ఏదో మలయాళ చిత్రం పోస్టర్ లా కనిపిస్తోంది.

అందులో బన్ని హెడ్ మాత్రమే మార్ఫింగ్ చేసారని అర్దం అవుతోంది. అయితే పుష్ప కథాంశాన్ని ఎక్కడా డైవర్ట్ చేసేలా ఈ పోస్టర్ లేనే లేదు. పక్కాగా కథను ఎలివేట్ చేసేదిగా కనిపిస్తోంది. ఎర్రచందనం దుంగల్ని ఎత్తుకెళ్తున్న లారీ డ్రైవర్ ని ఛేజ్ చేసిన పోలీసులకు ఇలాంటి గతి పడుతోంది అన్న అర్దం వచ్చేలా ఈ పోస్టర్ ఉంది. అంటే ఫ్యాన్స్ సినిమా మీదా ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఇమాజినేషన్ చేశారో అర్దం అవుతోంది. మొత్తానికి ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఖుషి అవుతూ ఈ పోస్టర్ ని షేర్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -