Friday, March 29, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

- Advertisement -

అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తారో తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే కలక్షన్ల వర్షం కురవాల్సిందే. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్య సినిమాతో అల్లు అర్జున్ కి మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది.

అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పెద్ద నిర్మాత అన్న విషయం తెలిసిందే. బన్నీకి ఇద్దరు పిల్లలు. బన్నీ రీసెంట్ గా అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్ల షేర్ రాబట్టింది. బన్నీకి బాగా ఇష్టమైన హీరో చిరంజీవి. ఆయన కోసం ఏం చేయడానికైన రెడీ అని చాలా సార్లు బన్నీ చెప్పిన విషయం తెలిసిందే. ఇక హీరోయిన్స్ లో రాణి ముఖేర్జీ అంటే బన్నీకి ఇష్టమట.

అలానే ఇష్టమైన సినిమా విషయంకు వస్తే చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా అంటే బన్నీకి చాలా ఇష్టమట. ఇక బన్నీ ఫ్రీ టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం.. బుక్స్ చదవడం.. ఫోటోగ్రఫీ చేయడం వంటివి చేస్తాడట. ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ ఒక స్టూడియోని నిర్మిస్తున్నారు. ఇక బన్నీ సినిమా విషయంకు వస్తే.. సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే సినిమాలో బన్నీ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో బన్నీ త్వరలోనే పాల్గోనబోతున్నాడు. గతంలో బన్నీ, సుకుమార్ కాంబోలో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చి మంచి హిట్ అయ్యాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సునీల్..?

పూజా హెగ్డే గురించి మనకు తెలియని కొన్ని విషయాలు

జూ ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

అనసూయ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -