Friday, March 29, 2024
- Advertisement -

సరిహద్దు దాటిన ప్రేమ పై అల్లు అర్జున్ కామెంట్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక ఆసక్తికరమైన చిత్రం లో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని ఎదురు చూసిన అభిమానులు ఇప్ప్పుడు ఆతృతగా విడుదల తేదీ కోసం చూస్తున్నారు.

ఇది పక్కన పెడితే, అల్లు అర్జున్ ప్రస్తుతం తన తెలుగు సినిమాలు హిందీ లో బాగా హిట్ అయినందుకు సంతోషం గా ఉన్నాడు. సాధారణం గా అతని తెలుగు సినిమాలని హిందీ లో డబ్ చేసి విడుదల చేస్తారు దర్శక నిర్మాతలు. అలాగే సరైనోడు అనే సినిమా ని, అంతే కాకుండా దువ్వాడ జగన్నాథం అనే సినిమా ని హిందీ లో కి డబ్ చేసి విడుదల చేశారు. అయితే ఈ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకాదరణ పొందాయి.

మొదటగా సరైనోడు సినిమా 200 మిలియన్ వ్యూస్ పొందగా, దువ్వాడ జగన్నాథం 150 మిలియన్ పైగా వ్యూస్ సాధించింది. ఈ నేపథ్యం లో ఈ సరిహద్దు దాటిన ప్రేమ గురించి బన్నీ పేర్కొన్నాడు.

“వీక్షకులు అందరికీ నా ధన్యవాదాలు. ఎక్కడెక్కడి నుంచో సినిమా చూసి అభినందిస్తున్న మీ ప్రేమకి సరిహద్దులు లేవు. రాబోయే సంవత్సరాలలో కూడా ఇలాగే మిమ్మల్ని రంజింపజేస్తాను.” అని బన్నీ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -