ఫ్రెష్ లుక్‌లో బ‌న్ని అదుర్స్‌

226
Allu Arjun New Look for Trivikram Srinivas Movie
Allu Arjun New Look for Trivikram Srinivas Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కొత్త సినిమాను చేస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిన విష‌య‌మే. గ‌తంలో వీరిద్ద‌రు కాంబినేష‌న్‌లో రెండు సినిమాలు వ‌చ్చాయి. జులాయి, స‌న్నాఫ్ స‌త్యమూర్తి సినిమాలు చేశారు వీరిద్ద‌రు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజ‌యాలు సాధించాయి. మ‌రోసారి వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేయ‌డంతో ఇండ‌స్ట్రీ క‌ళ్లు ఈ సినిమాపై ప‌డ్డాయి.

ఈ సినిమాలో బ‌న్ని కొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నార‌ని టాక్‌. ఆ మ‌ధ్య బ‌న్ని కాస్తా లావుగా మారి ద‌ర్శ‌నం ఇచ్చాడు. అయితే ఇలా ఉంటే త‌న సినిమాకు క‌ష్టం అని త్రివిక్ర‌మ్ చెప్ప‌డంతో, బ‌న్ని బ‌రువు తగ్గే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. రేసు గుర్రం సినిమా ముందు వరకు కాస్త సన్నగానే ఫిట్ బాడీతో ఉన్న బన్నీ ఆ తర్వాత నుంచి కాస్త ఒళ్ళు చేసినట్టు ఆ పై వచ్చిన సినిమాలు చూస్తేనే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా కోసం బ‌న్ని లాంగ్ హెయిర్ లుక్ లోకి వచ్చేసారు.

ఈ మ‌ధ్య ఆర్య‌- సాయేష పెళ్లికి వెళ్లిన బ‌న్ని త‌న స్టైల్‌ను అభిమానుల‌కు ప‌రిచియం చేశాడు. తాజాగా వచ్చిన ఫొటోల్లో మాత్రం బన్నీ చాలా స్లిమ్ గా ఫ్రెష్ లుక్‌తో కనిపిస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే నెల‌లో సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డెను ఎంపిక చేశారు.