Thursday, March 28, 2024
- Advertisement -

అల్లు అర్జున్ చాలా కూల్ పర్సన్: పీ ఆర్ టీమ్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తన తదుపరి సినిమా కి సంబందించిన కో డైరెక్టర్ కి మధ్య సెట్స్ మీద వాగ్వాదం జరిగింది అనే పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ విషయం మీద క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది.

ఈ రూమర్స్ పై ఎవరు రెస్పాండ్ అవుతారు అని ఎదురు చూస్తుండగా, అల్లు అర్జున్ పీ ఆర్ టీమ్ కి సంబందించిన శ్రీనివాస్ ట్విట్టర్ లో రెస్పాడ్న అయ్యారు. “స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక ఫ్రెండ్లీ నటుడు. చాలా కూల్ గా ఉంటారు సెట్స్ మీద. ఆయన మీద వచ్చిన పుకార్లని టీవీ 9 క్లారిఫై చేసింది” అని చెప్పి ఒక వీడియో షేర్ చేశారు.

ఈ పోస్ట్ తో ఇక అల్లు అర్జున్ మీద వస్తున్న పుకార్లు, నెగటివిటీ తగ్గిపోతాయేమో చూడాలి మరి.

ఈ సినిమా ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, గీత ఆర్ట్స్ మరియు హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -