Thursday, April 25, 2024
- Advertisement -

ప్రభాస్ ని చూసి చేతులు కాల్చుకుంటున్న బన్నీ?

- Advertisement -

యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త చిత్రం సాహో ని హిందీ లో అత్యంత పెద్ద ఎత్తున విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఎన్ని ఎక్కువ థియేటర్ల లో విడుదల చేసినంత మాత్రాన సినిమా లో కథ సరిగా లేకపోతే ఆడదు అనే విషయం పైన ఒక క్లారిటీ అయితే అందరికీ వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమా కి వచ్చిన క్రేజ్ చూసి ఇప్పుడు అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని ఇదే స్థాయి లో బాలీవుడ్ లో పెద్ద ఎత్తున విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడట.

కాకపోతే బన్నీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే సాహో కి అంత క్రేజ్ రావడానికి కారణం ఇంతకు ముందు ప్రభాస్ బాహుబలి అనే సినిమా చేయడం. ఈ సినిమా మంచి విజయం సాధించడం వలన సాహో కి కాస్తో కూస్తో క్రేజ్ వచ్చి పడింది. కాకపోతే సాహో లో విషయం లేకపోవడం తో ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.

అయితే ఇప్పుడు బన్నీ అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభాస్ కి ఆల్రెడీ మార్కెట్ ఉంది కాబట్టి తన సినిమా సాహో అక్కడ కాస్తూ కూస్తో నడిచింది. అదే లేకుండా ఉంటె కష్టం అయ్యేది. ఇప్పుడు బన్నీ కూడా భారీ ఎత్తున తన సినిమా విడుదల చేయాలి అనుకోవడం కన్నా మెల్ల మెల్లగా తన మార్కెట్ ఇంప్రూవ్ చేసుకుంటే మంచిది లేదంటే చేతులు కాల్చుకోవడమే జరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -