Friday, April 19, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కార్ కి ఉన్న స్పీడ్ లిమిట్

- Advertisement -

ట్రాఫిక్ రూల్స్ పాటించడం మన అందరి బాధ్యత. ఇది మామూలు ప్రజానీకానికి మాత్రమే కాదు సెలబ్రిటీలకు సైతం వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే తన ఖరీదైన క్యారవాన్ ని అందరికీ సోషల్ మీడియా ద్వారా చూపించిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండియా లోనే ఇంత లగ్జరీ ఉండే కార్ బన్నీ దగ్గరే ఉంది. అయితే ఈ క్యారవాన్ ని నడిపే డ్రైవర్ ఆ వాహనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు.

ఈ క్యారవాన్ కి స్పీడ్ లిమిట్ ఉంటుందట. స్పీడ్ 80 కి చేరగానే స్పీడ్ లాక్ పడిపోతుందట. తన వల్ల రోడ్ మీద వెళ్లేవారికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని బన్నీ చేపట్టిన ఒక ముందు జాగ్రత్త చర్య ఇది. ఇక సినిమాల పరంగా చూస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠ పురంలో’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు మరియు సుశాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -