బన్నీ దృష్టిలో బెస్ట్ డాన్సర్ చిరు కాదట.. జవాబులు మారాయి..!

1252
allu arjun shocks mega fans
allu arjun shocks mega fans

అల్లు అర్జున్.. ఎంతో కష్టపడి స్టార్ హోదా సంపాదించుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పుటికి టాలెంట్ లేకుంటే ఇండస్ట్రీలో రాణించలేం. అయితే బన్నీ మాత్రం తన టాలెంట్ ను నమ్ముకుని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నడు. అల వైకుంఠపురంలో భారీ సక్సెస్ తరువాత పుష్ప మూవీని పాన్ ఇండియా చిత్రంగా మార్చారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా చిత్రంగా చేయాలన్న ఆలోచన మొదటలేదు.

అల వైకుంఠపురంలో సూపర్ హిట్ కావడం వల్ల ఇది పాన్ ఇండియా మూవీగా మారింది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే బన్నీ బాలీవుడ్ లో రాణించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం అభిప్రాయాలు, పాత స్వరాలు కూడా మార్చేశాడు అనిపిస్తుంది. ఓ నేషనల్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన దృష్టిలో బెస్ట్ డాన్సర్ ఎవరని చెవితే బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా పేరు చెప్పారు.

అలాగే మీకు స్ఫూర్తి నిచ్చే నటుడు ఎవరంటే అమితాబ్ పేరు చెప్పారు. ఈ రెండు సమాధానాలలో తన మామ చిరంజీవి పేరు లేకపోవడం గమనార్హం. గతంలో అనేక వేదికలపై చిరంజీవి డాన్సులను, నటనను వీర లెవల్లో పొగిడిన అల్లు అర్జున్ జాతీయ స్థాయి మీడియాలో మాత్రం బాలీవుడ్ హీరోల పేర్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు. బాలీవుడ్ లో ఎదగాలనుకుంటున్న బన్నీ అక్కడి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడాని తెలివిగా ఈ సమాధానాలు చెప్పి ఉంటారని అంటున్నారు. తెలుగులో క్రేజ్ కోసం చిరంజీవి పేరు ఉపయోగించుకున్న బన్నీ.. బాలీవుడ్ కి వచ్చేసరికి మాట మార్చేశాడు.

ఎక్స్‌పోజింగ్ అనోసరంగా చేశానేమో : యుమనా

దేవరకొండ ఎన్ని కుటుంబాలకు సాయం చేశాడో తెలుసా ?

చిరు వర్సస్ బాలయ్య ఇష్యూపై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!

లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమాలు.. ఇంకెంత షూట్ చేయాలంటే ?

Loading...