Friday, March 29, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ప్రకటన, ఎవరికి వార్నింగ్?

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా కోసం పని చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా, వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశ లో ఉంది. ప్రస్తుతం జులై నెల నడుస్తుంది కానీ వచ్చే ఏడాది జనవరి లో విడుదల కావాల్సిన సినిమాల గురించి ఇప్పుడే చర్చ మొదలయింది. ఆల్రెడీ స్పాట్స్ ఫిక్స్ చేసేసుకుంటున్నారు హీరోలు.

సినిమా ప్రకటించినప్పుడే మహేష్ బాబు నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవరు సంక్రాంతి కి విడుదల అవుతుంది అని చెప్పారు దర్శక నిర్మాతలు. అయితే మహేష్ ఒక స్పాట్ ఫైనల్ చేసుకున్నాడు కాబట్టి థియేటర్లు దొరకడం కష్టం అని చెప్పొచ్చు. అయితేఇంకా ఎవరెవరు సంక్రాంతి కి వద్దాం అని అనుకుంటున్నారో, వాళ్ళ విషయమై ఒక క్లారిటీ లేదు.

ఈ నేపథ్యం లో అల్లు అర్జున్ సినిమా నిర్మాతలు సంక్రాంతి కి రానున్నట్లు ప్రకటన చేసారు. అయితే ఈ ప్రకటన వల్ల ఇండైరెక్ట్ గా నే సంక్రాంతి ని టార్గెట్ చేస్తున్న వాళ్ళ అందరికీ ముందస్తు వార్ణింగ్ ఇచ్చినట్లు అనుకోవచ్చు. ఇప్పటికే మహేష్ వస్తున్నాడు, ఒక బన్నీ కూడా వస్తున్నా అని చెప్పడం తో ఇంకెవరూ వచ్చే ప్రయత్నం చేయలేరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -