Thursday, April 25, 2024
- Advertisement -

అల్లు కుటుంబం నుంచి ‘క్యారెక్టర్ అర్టిస్ట్’

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక ఆసక్తికర సినిమా చేయనున్నారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుంది అనే విషయం మీద ఇప్పటికి అయితే క్లారిటీ లేదు. అయితే అల్లు అర్జున్ గంగోత్రి సినిమా తో ఇండస్ట్రీ లో కి ప్రవేశించాడు. అల్లు అరవింద్ కి మొత్తం ముగ్గురు కుమారులు. అందులో రెండో వాడు బన్నీ. ఆ తర్వాత చిన్న వాడు శిరీష్ కూడా సినిమాల్లోకి ప్రవేశించాడు. ఆయన నటించిన మొదటి సినిమా గౌరవం.

ఇక అందరి కన్నా పెద్ద అయినా బాబీ ఎప్పుడు తెర వెనుకే ఉండేవాళ్ళు. బాబీ ఇప్పటి వరకు పెద్దగా సినిమా ఫంక్షన్ల కి హాజరు అయిన దాఖలాలు కూడా లేవు. ఇటీవలే రెండో వివాహం చేసుకున్న బాబీ నిర్మాణం లో కి అడుగు పెట్టాలి అనే ఆలోచన లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నిర్మాణం మీద పెద్దగా ఆసక్తి లేదు కానీ సినిమాల్లో నటుడిగా రాణించాలని బాబీ ప్రయత్నాలు చేస్తున్నారట.

అయితే హీరో గా ఆసక్తి లేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రాణించాలని కుతూహలాన్ని తన తండ్రి దగ్గర బయట పెట్టారట. కాకపోతే ఈ విషయమై ఏం నిర్ణయం తీసుకున్నారు అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -