Tuesday, April 23, 2024
- Advertisement -

త్రివిక్రమ్ సినిమాలో సునీల్ లేడా?

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ని విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో సునీల్ కూడా ముఖ్యపాత్ర పోషించనున్నాడు అని సమాచారం. హీరోగా వరుస డిజాస్టర్లు అందుకున్న సునీల్ మళ్ళీ కామెడియన్ గా ప్రయత్నించాలని నిర్ణయించుకున్న సునీల్ కి మంచి స్నేహితుడైన త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆ సినిమాలో సునీల్ పాత్ర అంత క్లిక్ అవ్వలేదు.

కాబట్టి త్రివిక్రమ్ మళ్ళీ బన్నీ సినిమాలో సునీల్ కి ఒక మంచి రోల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. రావు రమేష్, టబు కూడా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా లో ఇప్పుడు సునీల్ కూడా మంచి పాత్ర చేయబోతున్నారని తెలుస్తోంది. సునీల్ కోసమే హీరో పక్కనే ఉండే ఒక మంచి పాత్ర డిజైన్ చేసినట్లు సమాచారం. రావు రమేష్ కాల్షీట్స్ కుదరకపోవడంతో ఆ పాత్రకి హర్ష వర్ధన్ కి దక్కింది. కాబట్టి సునీల్ పాత్రకి ప్రాధాన్యత తగ్గించవలసి వచ్చిందట. అసలు ఆ పాత్రని తీసేసారని కొందరి వాదన. పృథ్వి కూడా ఈ సినిమాలో నటించాలి కానీ జనసేన గురించి, నాగబాబు గురించి పృథ్వి కామెంట్స్ చేయటంతో అతనిని తీసేసారు. మరి ఈ సినిమాలో కమెడియన్స్ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -