Tuesday, April 23, 2024
- Advertisement -

హీరోయిన్‌ను కాపాడి రియ‌ల్ హీరో అనిపించుకున్న అల్లు శిరీష్

- Advertisement -

అల్లు శిరీష్ హీరోగా స‌క్సెస్ కావడానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాని అల్లు శిరీష్ రీల్ లైఫ్‌లో గొప్ప హీరో కాక‌పోవ‌చ్చు కాని రియ‌ల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. అల్లు శిరీష్ ప్ర‌స్తుతం ‘ఎబిసిడి’ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం అమెరికాలో జ‌ర‌గుతుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఓ లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాకు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

సినిమా షూటింగ్ స‌మ‌యంలో కొంద‌రు ఆక‌తాయ‌లు , తాగి హీరోయిన్ రుక్సార్‌ను వేధించారు. షూటింగ్‌లో వేరే సీన్ జ‌రుగుతుండ‌టంతో దీనిని ఎవ‌రు పెద్ద‌గా చూడ‌లేదు. కాని అల్లు శిరీష్ మాత్రం ఈ సంఘ‌ట‌న‌ను గ‌మ‌నించార‌ట‌. కాక‌పోతే అప్పుడు ఆయ‌న సీన్‌లో న‌టింస్తుండ‌టంతో ఏం చేయ‌లేక‌పోయ‌ర‌ట‌. సీన్ పూర్తి అయిన త‌రువాత రుక్సార్‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించిన వారితో ఆమెకు క్ష‌మాప‌ణ‌లు చెప్పించాడ‌ట అల్లు శిరీష్. మొత్త‌నికి రీల్ హీరో , రియ‌ల్ హీరో అనిపించుకున్నాడ‌ని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -