Thursday, April 25, 2024
- Advertisement -

అమల పాల్ ’ఆమె’ రివ్యూ

- Advertisement -

తమిళ సినిమా పరిశ్రమ లో అగ్ర కథానాయికల్లో ఒకరు అమల పాల్. తెలుగు లో కూడా సినిమాలు చేసిన అమల గత కొంత కాలం గా ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు తమిళం లో ఆడై అనే ఒక సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఈ రోజే తెలుగు లో కూడా విడుదల అవుతుంది. టీజర్ మరియు ట్రైలర్ తో ఆడియన్స్ లో ఆసక్తి ని క్రియేట్ చేయడం లో సఫలం అయిన సినిమా యూనిట్ ఇప్పుడు సినిమా కూడా అందరినీ మెప్పిస్తుంది అనే ధైర్యం తో ఉన్నారు. రత్నకుమార్ దర్శకత్వం లో ఈ సినిమా విడుదల కాగా, తెలుగు లో ఈ సినిమా ని తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పిస్తున్నారు.

కథ:
కామిని (అమలాపాల్) ఒక టీవీ ఛానెల్ లో పని చేస్తుంది. ఒక రోజు తన ఫ్రెండ్ పుట్టిన రోజు పార్టీ కి వెళ్ళి అక్కడ ఫుల్ గా మద్యం సేవించి బాగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాతి రోజు ఉదయం కామిని కనిపించడం లేదు అని కామిని తల్లి పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది. తీరా చూస్తే కామిని ఒక పాడుబడ్డ బిల్డింగ్‌లో న్యూడ్‌గా కనిపిస్తుంది. అసలు ఆమె అక్కడకి ఎలా చేరింది? తను న్యూడ్ గా ఉండటానికి కారణం ఏంటి? ఆ రాత్రి ఏం జరిగింది? అనేది సినిమా కథ.

నటీనటులు:
సినిమా మొత్తంలో అమలాపాల్ నటన ఆయువుపట్టుగా చెప్పవచ్చు. తన అద్భుతమైన నటన సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అమలాపాల్ కి ఛాలెంజింగ్ రోల్ దొరకడం మాత్రమే కాక ఆమె తన నటనతో తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. తన పాత్రకు ఊపిరి పోసింది. సినిమా చూస్తే అమలాపాల్ తప్ప ఆ పాత్రలో ఇంకెవరు అంత బాగా నటించలేరేమో అనేలా తన పాత్రలో ఒదిగిపోయింది అమల. రమ్య సుబ్రహ్మణ్యం కి ఈ సినిమాలో పెద్ద పాత్ర దొరికింది. సినిమాలో ఆమె చక్కని నటన కూడా మరింత ప్లస్ అయింది అని చెప్పవచ్చు. అమలాపాల్ తల్లి పాత్రలో శ్రీరంజని కూడా చాలా బాగా నటించింది. వివేక్ ప్రసన్న చాలా సహజంగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:
దర్శకుడు రత్నకుమార్ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన కథను ఎంపిక చేసుకోవడం మాత్రమే కాక తన అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టి పడేసారు. సినిమా మొదలైన దగ్గర నుంచి ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టించకుండా కథను, కథలోని మలుపులు చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు రత్నకుమార్. అతని నేరేషన్ కూడా సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. రాంబాబు కల్లూరి మరియు విజయ్ మొరవేనేని అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్రదీప్ కుమార్ అందించిన సంగీతం సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం ప్రేక్షకులను సినిమా కథ లోకి లీనమై పోయే విధంగా చేస్తుంది. రాజేష్ ఏ మూర్తి ఈ సినిమా కోసం మంచి డైలాగులు అందించారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటింగ్ కూడా బాగుంది.

తీర్పు:
ఒక బలమైన కథ ఉండటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమా మొదలవడమే చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. మొదటి పావుగంట లోనే ప్రేక్షకులు సినిమా కి బాగా కనెక్ట్ అయిపోతారు. అమలాపాల్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించారు. ఇక రెండవ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగిస్తాయి. పైగా కథ అంత ప్రెడిక్టిబుల్ గా లేకపోవడం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. అమలాపాల్ అద్భుతమైన నటన మరియు రత్న కుమార్ స్క్రీన్ప్లే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్లు కూడా ఏమీ లేవు. అయితే డబ్బింగ్ సినిమా కాబట్టి తమిళ నేటివిటి కొంచెం ఎక్కువ అవడం తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. మరియు తమిళ ప్రేక్షకులు కథతో కనెక్ట్ అయినంత సులువుగా తెలుగు ప్రేక్షకులు సినిమాని ఆస్వాదించలేకపోవచ్చు. చివరిగా ‘ఆమె’ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా ఒక త్రిల్లింగ్ రైడ్ ఇస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -