Friday, April 19, 2024
- Advertisement -

“వి ” సినిమా టీం కి అమెజాన్ పెద్ద షాక్ ఇచ్చిందా..?

- Advertisement -

ఇటీవలే నాని వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా నాని గత సినిమాలకంటే భిన్నంగా ఉండగా, ఈ సినిమా రిలీజ్ విషయంలో వి సినిమా టీం సెంటిమెంట్ ని అమెజాన్ బ్రేక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి..నిజానికి వి సినిమా సెప్టెంబర్ నాలుగవ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత విడుదలవ్వాల్సి ఉందట.

కానీ అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం చిత్ర బృందానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా 10 గంటలకు విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, అన్ని మాధ్యమాల్లో ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల అవుతుందనే ప్రకటించారు. కానీ సెప్టెంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటలకి అమెజాన్ ప్రైమ్ లో వి సినిమా స్ట్రీమింగ్ మొదలైంది.

12 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 5వ తేదీ రోజు నాని నటించిన మొదటి సినిమా అష్టాచమ్మా రిలీజ్ అయింది. కాబట్టి అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ఈ సినిమా కూడా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల చేయాలి అని అనుకున్నారట. కానీ సినిమా ముందు రోజు రాత్రే విడుదలవడం తో చిత్ర బృందం మొత్తం షాక్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -