Friday, April 26, 2024
- Advertisement -

రవితేజ సినిమా సీక్వెల్ లో విజయ్ దేవరకొండ

- Advertisement -

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ఈ మధ్యనే రామ్ హీరోగా విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక తాజాగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరో గా ఒక సినిమాని చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించిన బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరొక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమా కూడా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్తో సాగుతుంది. ఆ సినిమాలో హీరోగా నటించిన రవితేజ బాక్సర్ పాత్రలో కనిపించారు. అయితే తాజాగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ సినిమా కూడా ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ తరహా లో ఉండబోతోందని ఆ సినిమా సీక్వెల్ గానే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ‘అమ్మానాన్న తమిళ అమ్మాయి’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. మరి ఆ సినిమా సీక్వెల్ తరహాలో ఉండబోతున్న ‘ఫైటర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -