Wednesday, April 24, 2024
- Advertisement -

’అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీ రివ్యూ..!

- Advertisement -

ఏపీ పొలిటికల్ లీడర్స్ పాత్రలను ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ’అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

2019 ఎన్నికల్లో వెలుగు దేశం పార్టీపై ఆర్సీపీ విజయం సాధిస్తోంది. 151 సీట్లతో జగన్నాథ రెడ్డి గౌవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. అధికారాన్ని కోల్పోయిన వెలుగు దేశం పార్టీ అధినేత బాబు, ఆయన కుమారుడు చినబాబు, పార్టీ నేతలు ఓటమిని సహించలేక ప్రభుత్వాన్ని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తుంటారు. ఇంకోవైపు సీఎం జగన్నాథ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతుంది.

ఈ క్రమంలో బాబుకు బాగా దగ్గర వ్యక్తి అయిన దయనేని రమా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తారు. జగన్నాథ రెడ్డి పై ప్రజలకు ఉన్న నమ్మకంను పోగొట్టేలా అధారాలు సృష్టిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బెజవాడ బెంజ్ సర్కిల్‌లో ప్రజలంతా చూస్తుండగానే దయనేని రమాను కొంత మంది దారుణంగా హత్య చేస్తారు. అసలు ఈ హత్యకు కారణం ఎవరు ? ఈ హత్య వెనకు ముఖ్యమంత్రి ఉన్నాడా ? లేకపోతే ప్రతిపక్షమే చేయించిందా ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల తరవాత జరిగిన పరిణామాలను ఆధారంగా తీసుకుని ఒక కల్పిత కథను చూపించారు. ప్రీ ఇంటర్వెల్ వరకు మనకు తెలిసిన కథనే సెటైరికల్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. అయితే ఆ క్యారెక్టర్లను జనాలు ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో దయనేని రమా హత్యతో ప్రేక్షకులో ఆసక్తిని పెంచుతుంది.

సినిమాలో ప్రతి పాత్రను ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు. రాజకీయాల్లో ఉన్న ప్రముఖులను పోలీన పాత్రలతో వర్మ, ఆయన శిష్యుడు సిద్దార్ద తాతోలు చేయించిన విధానం బాగుంది. మనసేన పార్టీ అధినేత ప్రణయ్ కళ్యాణ్ పాత్రను మాత్రం కేవలం సెటైర్ వేయడానికి మాత్రమే పెట్టినట్టు అనిపించింది. స్పీకర్ పమ్మినేనిగా ఆలీ అదరగొట్టారు. బాగా నవ్వించారు. పీపీ జాల్ పాత్రలో రాము తన విశ్వరూపం చూపించాడు. ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో బాగా కుదిరింది.

ధన్‌రాజ్, కత్తి మహేష్, స్వప్న తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. టెక్నికల్‌గా సినిమాను హై క్వాలిటీతో తెరకెక్కించారు. ముఖ్యంగా కెమెరా వర్క్ చాలా బాగుంది. డైలాగ్స్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : తెలిసిన కథనే చూపించినట్లు అనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ సెకండాఫ్ ఉండదు. చాలా చోట్ల బోర్ కొట్టించాడు. అయితే రాజకీయ ప్రముఖుల పాత్రలను పోలీ ఉన్న వ్యక్తులతో నటన రాబట్టుకున్నప్పటికి వారు చెప్పే డైలాగ్స్ కాస్త కుదరలేదు అనిపిస్తోంది. ఓ హత్య చుట్టు తిరిగే కథలో ఆ హత్య ఎవరు చేశారు అనేది క్లారిటీ లేదు. అది ఒక రాజకీయ హత్యగానే చూపించారు.

మొత్తంగా : రామ్ గోపాల్ వర్మ ఒక సెటరికల్ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకులకు అందించారు. ప్రజలకు కావాల్సిండే కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే అని వర్మ చూపించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -