Thursday, March 28, 2024
- Advertisement -

పెళ్లి కాకుండానే తల్లైన ఎమీ జాక్స‌న్‌

- Advertisement -

నేటిత‌రం అమ్మాయిలు , అబ్బాయిలు చాలా కొత్త‌గా ఆలోచిస్తున్నారు. త‌మ జీవితాన్ని త‌మ‌కు న‌చ్చిన విధాంగా ఉండ‌ల‌ని కోరుకుంటున్నారు. ఈ విష‌యంలో సెల‌బ్రిటీలు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా..?. సినిమా వారు త‌మ‌కు న‌చ్చిన జీవితాన్ని గ‌డుప‌టంలో ఓ అడుగు ముందే ఉంటారు. న‌చ్చిన వారితో న‌చ్చినంత కాలం ఎంజాయ్ చేస్తున్నారు నేటిత‌రం సినిమా వారు. స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్ గ‌తంలో నాకు పెళ్లి కాకుండానే తల్లిగా మార‌ల‌ని ఉంద‌ని చెప్పి సంచ‌ల‌నం రేపింది. తాజాగా ఈ మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టి చూపించింది హీరోయిన్ ఎమీ జాక్స‌న్‌.

త‌మిళ సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ ఆంగ్లో హీరోయిన్ త‌రువాత కాలంలో తెలుగు, హిందీ భాష‌ల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చి ఐ, 2.0 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించి అంద‌రికి బాగా రిజిస్టార్ అయింది. తాజాగా ఈ భామ పెళ్లి కాకుండానే గ‌ర్భ‌వ‌తి అయింది. అవును ఈ విష‌యాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. మ‌రి కొద్ది నెలల్లో నేను త‌ల్లిగా మార‌బోతున్నానంటు ఓ పోస్ట్ పెట్టింది ఎమీ జాక్స‌న్‌. చెప్పాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. మదర్స్‌డే రోజు పంచుకోవడం కంటే ఇంకో మంచి రోజు ఉండదనుకుంటున్నాను అంటూ ట్విట్ చేసింది ఎమీ.

ఇప్పుడు తల్లి కాబోతున్నాననీ, అక్టోబర్‌లో డెలివరీ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. పెళ్లి కాకుండానే త‌ల్లి కాబోతున్నాన‌ని ఆనందం అంద‌రికి చెప్ప‌డం విశేషం.ప్ర‌ముఖ వ్యాపారవేత్త అయిన జార్జి పనాయోటుతో గ‌త కొంత‌కాలంగా డేటింగ్ చేస్తోంది ఎమీ జాక్సన్‌. వీరిద్ద‌రికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారు అనుకున్నా త‌రుణంలో గ‌ర్భ‌వ‌తి వార్త‌ను చెప్పి అంద‌రికి షాకిచ్చింది ఎమీ జాక్స‌న్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -