Thursday, April 25, 2024
- Advertisement -

విజయ్ తమ్ముడికి బాగానే ఖర్చు పెట్టారుగా..?

- Advertisement -

ఇండస్ట్రీ లో వారసులు పెద్ద ఎత్తున వస్తున్నారు.. ఒక్కరు వస్తే చాలు ఆయనవెంట పాదులమంది హీరోలు కుటుంబం నుంచి వస్తున్నారు.. ఇక స్వయం కృషి తో ఇండస్ట్రీ కి వచ్చిన విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని కూడా టాలీవుడ్ కి పరిచయం చేసిన సంగతి తెలిసిందే.. దొరసాని సినిమా తో ఆనంద్ ఇండస్ట్రీ కి పరిచయమవగా, ఆ సినిమా అనుకున్నంత పేరు ను మాత్రం సంపాదించుకోల్డు..  అయన రెండో సినిమా గా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా తెరకెక్కగా ఇటీవలే ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్నట్లు ప్రకటన వచ్చేసింది..

లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాలు ఇప్పుడు OTT ల్లో రిలీజ్ అవుతుండగా ఈ సినిమా కూడా థియేటర్లు లేక అమెజాన్ లో రిలీజ్ అవుతుంది.. మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో రెండో సినిమా తో అయినా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుందామనుకున్నాడు కానీ అమెజాన్ రిలీజ్ అవడం కొంత మైనస్ అయినా అది తప్పలేదని చెప్పొచ్చు.. ఇక పేరు కు తగ్గట్లు మీడియం రేంజు బ‌డ్జెట్ సినిమా. త‌క్కువ రేటుకి అమేజాన్ కొనేసి ఉంటుంద‌నుకుంటున్నారంతా. నిజానికి ఈసినిమా కోసం 4.5 కోట్లు వెచ్చిందింద‌ని టాక్‌.

తొలి సినిమా `దొర‌సాని` ఆడ‌క‌పోయినా రెండో సినిమాని అమేజాన్ ఇంత రేటుతో కొనేసిందంటే విశేష‌మే మ‌రి. అయితే ఈసారి అమేజాన్ ఊర‌కే ఈ సినిమా కొన‌లేదు. అమేజాన్ ప్ర‌తినిథులు ఈ సినిమా చూసి, `బాగుంది` అని స్టాంప్ వేశాకే.. అమేజాన్ ఇంత రేటు వెచ్చించింద‌ని టాక్‌. ఇది వ‌ర‌కు సొంతం చేసుకున్న మూడు సినిమాలూ కేవలం కాంబినేష‌న్‌, క్రేజ్‌చూసి సొంతం చేసుకుంది. ఈసారి మాత్రం కాస్త ముందు జాగ్ర‌త్త వ‌హించి, శాటిలైట్ ఛాన‌ల్ లా ఆలోచించి, కొనుగోలు చేసింది. ఓటీటీలో విడుద‌ల చేస్తే సినిమా ఫ్లాపే అనే ఓ ముద్ర ప‌డిపోయింది. దాన్ని `మిడిల్ క్లాస్ మెలోడీస్` అయినా పోగొడుతుందేమో చూడాలి.

విజయ్ కోసం అనుష్క ప్రయత్నాలు..

ఆ హీరో ముద్దు పెట్టాలను చూశాడు 

ఈ విజయ్ సినిమా వెనుక అల్లు అర్జున్ హస్తం ఉందా..?

ఇన్ని సార్లు రీ షూట్ చేస్తే ఎలా చైతు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -