Friday, April 26, 2024
- Advertisement -

ఆ హీరోపై మోజు ప‌డ్డాన‌ని పబ్లిక్‌గా చేప్పేసింది..!

- Advertisement -

అన‌న్య పాండే.. తెలుగు ప్రేక్షకుల‌కు పెద్ద‌గా ప‌రిచియం లేని పేరు. బాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంది అన‌న్య పాండే. ఇంతకి ఈ భామ ఎవ‌రో తెలుసా..? బాలీవుడ్ హీరో చుంకీ పాండే కూతురే అన‌న్య పాండే. మొద‌టి సినిమా కూడా విడుద‌ల కాకుండానే అన‌న్య పాండే వార్త‌ల్లో నిలిచింది. ఈ భామ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

తాను బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌తో ప్రేమ‌లో ఉన్నాన‌ని తెలిపి పెద్ద సంచ‌ల‌న‌మే రేపింది. తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో పాల్గొన్న అన‌న్య పాండే సినిమా విష‌యాల‌తో పాటు, త‌న ఇష్టాలు , అల‌వాట్లు గురించి చెప్పుకొచ్చింది. వ‌రుణ్ ధావ‌న్ గురించి మాట్లాడుతు ఏమాత్రం మొహమాటపడకుండా తనకు వరుణ్ ధావన్ అంటే ఇష్టమని, అతడిని పిచ్చిగా ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఎనర్జీ ,క్యూట్,యాక్టివ్‌గా ఉంటాడ‌ని , ఈ విష‌యాలే అత‌నుపై మోజు ప‌డేలా చేశాయాని తెలిపింది.

ఇలా చెప్ప‌వ‌చ్చో లేదో త‌న‌కు తెలియ‌దని వ‌రుణ్ అంటే నాకు పిచ్చి అని, అత‌నిని గాఢంగా ప్రేమిస్తున్నాన‌ని తెలిపింది. ఇక వ‌రుణ్ విష‌యానికి వ‌స్తే … అత‌ను త‌న చిన్న‌నాటి స్నేహితురాలు అయిన నటాషాని ఘాడంగా ప్రేమిస్తున్నాడు. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో తెలిపాడు వ‌రుణ్‌. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇది తెలిసి కూడా వ‌రుణ్ ప్రేమిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -