Friday, April 26, 2024
- Advertisement -

చరణ్ కి అత్తయ్య గా మారిన అనసూయ.. ఎలా..?

- Advertisement -

తెలుగు యాంకర్లు.. ఇప్పుడు మంచి స్పీడ్ మీద ఉన్నారు. ఒకప్పటిలా కాకుండా.. రియాలిటీ షోల ద్వారా బాగా పేరు సంపాధించుకుంటున్నారు. ఇక కామెడీ షోలకు అయితే ఇక హద్దే లేదు. అప్పట్లో మాట్లాడే విధానం మీద పట్టు ఉంటే సరిపోయేది.. కానీ ఇప్పటికి యాంకర్లకు గ్లామర్ చూపించే పట్టు ఉండాలి.

ఆ తరహాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఎవరంటే అనసూయ. వయసుతో సంబంధం లేకుండా ఈ యాంకర్ వేసే డ్రెస్సులకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అలానే సినిమాల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ అలరిస్తోంది. అంతే కాకుండా స్పేషల్ సాంగ్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఒక స్పెషల్ రోల్ చేస్తోంది. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న.. రంగస్థలం1985 మూవీలో. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. అయితే అనసూయ ఈ సినిమాలో ఓ స్పేషల్ పాత్ర చేస్తోందా అని అనుకున్నారు. బహుశా స్పెషల్ సాంగ్ లో చిందులు వేస్తుందేమో అనుకున్నారు.

కానీ ఎవరు ఉహించని విధంగా రామ్ చరణ్ కి మేనత్త పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. ఇంతకుముందే సోషల్ మీడియాలో పల్లెటూరి అమ్మాయిలాగా ఉండే ఓ ఫోటో ఫోస్ట్ చేసింది. కానీ ఆ ఫోటోలో కేవలం తన పాదాలని మాత్రమే చూపించింది. అయితే సినిమాలో మొత్తం అమ్మడు పల్లెటూరి మహిళలా కనిపించనుందట. అనసూయ పాత్ర కొత్తగా ఉంటుందట. ఇక చరణ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -