Friday, April 26, 2024
- Advertisement -

ఆదిని షోలో కొట్టిన ఆడపడుచులు.. ఏం జరిగింది ?

- Advertisement -

జబర్డస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ అనసూయకు మంచి పేరు వచ్చింది. ఇక జబర్దస్త్ లో అనసూయ, హైపర్ ఆది లకు మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఈ ఇద్దరికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ లో హైపర్ ఆది పంచులకు అనసూయ తెగ నవ్వేస్తోంది. అప్పుడప్పుడు అనసూయపై కూడా ఆది పంచులు వేస్తూ ఉంటాడు. ప్రతి రోజు పండగే (బ్రాండ్ న్యూ లేడీస్) అనే లేటెస్ట్ టెలివిజన్ షో ఒకటి ప్రసారం అవుతోంది. దీనికి అనసూయ యాంకర్ గా చేస్తోంది.


ఇది ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసమే డిజైన్ చేసిన షో. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో అనసూయ ప్రేమ కోసం హైపర్ ఆది ప్రయత్నాలు హైలైట్‌గా నిలిచాయి. అనసూయకు రోజా పువ్వు ఇస్తూ సిగ్గు పడ్డాడు. ‘నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా’ అంటూ ఓ సాంగ్ వేసుకొని అనసూయపై ఉన్న లవ్ తెలిపాడు. హైపర్ ఆది చేష్టాలు చూసిన అనసూయ.. షోలో పాల్గొనడానికి వచ్చిన ఆడపడుచులను పిలిచి విషయం చెప్పింది. ఇది ఆడవాళ్ల షో అయితే నువ్వేందుకు వచ్చావని ఆదిని ఆ ఆడపడుచులు ప్రశ్నించగా..

’అనసూయ మనసు గెలుచుకోవడానికి వచ్చా’ ఆది చెప్పాడు. అంతేకాకుండా ఆది పంచులు మీద పంచులు వేస్తునే ఉన్నాడు. దాంతో అటాక్ అంటూ ఆర్డర్ ఇచ్చేసింది అనసూయ. దాంతో ఆడపడుచులంతా ఒక్కటై హైపర్ ఆదిని చితకబాదారు. దీంతో భయపడిపోయిన హైపర్ ఆది.. అమ్మో! ఇది ఆడవాళ్ళకు మాత్రమే అట.. కాస్త చూసుకోండి అంటూ వెళ్ళిపోయాడు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -