Thursday, April 25, 2024
- Advertisement -

అనసూయ యాంకరే కాదు.. డాన్సర్ కూడా..!

- Advertisement -

అనసూయకు బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతూనే ఇతర షోస్ కూడా చేస్తోంది. షోస్ మాత్రమే కాదు సినిమాల్లో కూడా నటిస్తోంది. టాప్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ అందాలు ఆరబోయడంలో ఎక్కడ వెనకడటం లేదు. అందుకే ఆమెను కొందరు అతిగా అందాలు ఆరబోస్తున్నవ్ అని విమర్శిస్తున్నప్పటికి ఆమె ఫ్యాన్స్ మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. అనసూయ వల్ల ఆ షోస్ కు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగిపోతుంది.

అయితే అనసూయ ఏ విషయంలో తగ్గడం లేదు. ఇటీవలే జబర్దస్త్ జడ్జీ రోజా క్లాసికల్ డాన్స్‌తో అదరగొట్టిన విషయ్ం తెలిసిందే. లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ‘నవ జనార్దన పారిజాతం’ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రోజా మంచి డాన్సర్ అన్న విషయం అందరికి తెలిసిందే. క్లాసికల్ డాన్స్ మాత్రమే కాదు.. అన్ని రకల డాన్సులు రోజా చేయగలదు. ఇప్పటికీ బుల్లితెరపై అప్పుడు అప్పుడు తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటునే ఉంది. ఇటివలే ఉగాది కానుకగా బుల్లితెర పై ఓ షో రాబోతుంది. అందులో రోజా, శేఖర్ మాస్టర్ కలిసి డాన్స్ ఇరగదీశారు. ఇక యాంకర్ అనసూయ విషయంకు వస్తే.. ఈమె కూడా డాన్స్ లో అదరగొట్టేస్తోంది. తన అందాలతో కుర్రాకారుకు పిచ్చేక్కిస్తోంది.

ఈ సారి రోజాకి పోటీ ఇవ్వాలని అనుకుందో ఏమో కానీ క్లాసికల్ డాన్స్ లో మెరబోతున్నట్లు అర్దం అవుతోంది. తాజాగా అదిరింది టీమ్ చేసిన ఈవెంట్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఈవెంట్ లో నాగబాబు, తరుణ్ భాస్కర్, నిహారిక, హీరోయిన్ అనుష్క, యాంకర్ రవి, యాంకర్ ప్రదీప్, భానుశ్రీ అందరు చాలా సరదాగా.. జోష్ లో కనిపించారు. ఇక్కడ అనసూయ కూడా కనిపించింది. కాకపోతే ఈ సారి కాస్త బిన్నంగా క్లాసికల్ దుస్తుల్లో కనిపించింది. దీని బట్టి చూస్తే అనసూయ కూడా క్లాసికల్ ఫర్ఫామెన్స్ ఇచ్చినట్లు అర్దం అవుతుంది. ఆ ఫర్మామెన్స్ చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు చూడాల్సిందే. ఏది ఏమైన.. అనసూయ తనలో ఉన్న టాలెంట్ ను ప్రేక్షకులకు చూపిస్తూ వారితో సూపర్బ్ అనిపించుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -