Thursday, April 25, 2024
- Advertisement -

పదేళ్ల పెళ్లి బంధంపై అనసూయ ఏం అన్నాదంటే ?

- Advertisement -

అనసూయ.. యాంకర్ గా, నటిగా రాణిస్తోంది. అయితే అనసూయ ఈ స్థాయికి రావడానికి ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ సపోర్ట్ ఎంతో ఉంది. ఆయన వల్లే తను ఈ స్థాయిలో ఉందని అనసూయ చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు మరోసారి తన భర్తపై ప్రేమను చాటుకుందామె. ఇందుకు కారణం ఏంటంటే జూన్ 4న సుశాంక్, అనసూయల పెళ్లిరోజు. ఇది 10వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా తన భర్తను ఉద్దేశిస్తూ అనసూయ ఇన్‍స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు.

అంతేకాదు.. తన భర్తతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. ‘‘నా బలం.. నా భయం.. నా గందరగోళం.. నా బ్యాలెన్స్.. నా రెక్కలు.. అన్నీ నువ్వే. నీ ప్రోత్సాహం లేకుండా నేను ఏం చేయగలనో నాకే తెలీదు. ప్రతిసారి మనం పోట్లాడుకుంటాం. ఇంకెప్పుడూ నీతో మాట్లాడకూడదు అని అనుకుంటా. నేనొక ఫూల్‌ని!!! నీతో మాత్రమే జీవించగలనని నేను నేర్చుకున్నాను. ఇంతకు మించి నాకేం తెలీదు. అధికారికంగా ఇది మన 10వ పెళ్లిరోజు. కానీ, మనం ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే ఉంటామని నీకు, నాకు తెలుసు. థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్‌ను ప్రేమించినంత గొప్పగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మెంటల్!!!’’ అని అనసూయ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అనసూయ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు ఓ ఎన్‍సీసీ క్యాంప్ కు వెళ్లారంట. అక్కడకి సుశాంక్ కూడా వచ్చాడు. అక్కడ అనసూయని చూసి ఇష్టాపడ్డారట. తర్వాత ఆమెకు తన ప్రేమ గురించి చెప్పాడట.

తర్వాత ఏడాదిన్నర తర్వాత మరోసారి ఎన్‌సీసీ క్యాంప్‌లో కలుకున్నారట. అప్పుడు పెళ్లిచేసుకుంటానని భరద్వాజ్ చెప్పారట. దీంతో అనసూయ కూడా పంచజెండా ఊపేశారు. అయితే అనసూయకు పెళ్లి సంబధాలు వాళ్ల ఇంట్లో వాళ్లు చూడటం మొదలు పెట్టారట. దాంతో తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందట. కానీ తన తండ్రికి అస్సలు ఇష్టం లేదట. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని చెప్పారట. దాంతో అనసూయ ఇంట్లో నుంచి వెళ్లిపోయారట. అయితే, భరద్వాజ్ మాత్రం పెద్దలను ఒప్పించే పెళ్లిచేసుకుందాం అని అనసూయకు నచ్చజెప్పారట. ఇలా 9 ఏళ్లు వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి 2010 జూన్ 4న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారట.

https://www.instagram.com/p/CBAhJkglADz/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -