మరోసారి రెచ్చిపోయిన అనసూయ భరద్వాజ్..?

785
anasuya fires on media
anasuya fires on media

బుల్లితెర యాంకర్ కొన్ని కొన్ని అంశాల్లో ఎలా రియాక్ట్ అవుతుందో అందరికి తెలిసిందే.. మహిళలకు జరిగే అన్యాయాల విషయాల్లో, దారితప్పుతున్న సమాజం పోకడల విషయంలో ఆమె ఎంతో ఆగ్రహంగా సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు.. తాజాగా ఆమె జయ ప్రకాష్ రెడ్డి చనిపోయిన తీరును ప్రసారం చేసిన మీడియా ను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయప్రకాష్ రెడ్డి గారి మరణం పై పలు సెలబ్రిటీలు సోషల్ మీడియా లో తమ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే యాంకర్, నటి అనసూయ కూడా సోషల్ మీడియా ద్వారా జయప్రకాశ్ రెడ్డి గారి మరణం పై తన సంతాపం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల జయ ప్రకాష్ రెడ్డి గారు బాత్రూం లో కుప్పకూలిపోయి ఉన్న వీడియో ని కవర్ చేసి ప్రసారం చేశారు.

దీనిపై అనసూయ ట్విట్టర్ వేదికగా ” నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బాత్రూం ని కూడా వదలట్లేదు. ఒక వ్యక్తి మరణం దగ్గర కూడా డిగ్నిటీ పాటించడం లేదు” అని అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు “నిజంగానే న్యూస్ కవరేజ్ కోసం ఇలా చేయడం తప్పు” అని అనసూయ కి మద్దతిస్తున్నారు.

ప్రముఖ సినీ నటులు జయ ప్రకాశ్ రెడ్డి గుంటూరులో ఉన్న తన నివాసంలో బాత్రూంలో కుప్పకూలి కార్డియాక్ అరెస్ట్ తో మరణించారు. జయప్రకాష్ రెడ్డి ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు, సహాయ పాత్రలు, కామెడీ పాత్రలు కూడా చేశారు. 1988లో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమాల్లో నటించారు జయ ప్రకాష్ రెడ్డి.

Loading...