Wednesday, April 24, 2024
- Advertisement -

లైవ్ లో నెటిజన్ పై ఫైర్ అయిన అనసూయ..!

- Advertisement -

జబర్దస్త్ యాంకర్ అనసూయ తెలుగు బుల్లి తెర హాట్ అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే నిన్న అనసూయ బర్త్ డే అనే విషయం తెలిసిందే. ఆమె తన కుటుంబంతో కలిసి బర్త్ డే ని జరుపుకుంది. తర్వాత అభిమానులతో కూడా పుట్టిన రోజును సంతోషాన్ని లైవ్ ద్వారా షేర్ చేసుకుంది.

ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన అనసూయ అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన దక్కించుకుంది. ఆమె చాలా మంది అభిమానులు బర్త్ డే విషేస్ తెలిపారు. ఇదే టైంలో కొందరు ఆమెకి కోపం తెప్పించారు. గతంలో కూడా అనసూయ సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ ఎదుర్కుంది. ఇప్పుడు మళ్లీ ఆమె బ్యాడ్ కామెంట్స్ ను ఎదుర్కొంది. లైవ్ లోకి వచ్చిన అనసూయ కాస్త మోడ్రన్ గా డిజైనర్ డ్రస్ ను వేసుకుంది. దాంతో ఒక నెటిజన్ నీవు ఇద్దరు పిల్లలకు తల్లి అనే విషయాన్ని మర్చి పోయావా.. కాస్త పద్దతిగా డ్రస్ వేసుకోవచ్చు కదా అంటూ కామెంట్ చేశాడు. అతడి కామెంట్ పై అనసూయ సీరియస్ అయ్యింది.

ఇలాంటి వాళ్ల వల్లే వాడు వీడు అనే పదాలు వస్తాయి. నువ్వు ఎవడివిరా నా డ్రస్ గురించి మాట్లాడటానికి.. అమ్మ అయితే ఆ డ్రస్ వేసుకోవాలి ఈ డ్రస్ వేసుకోకూడదు అనే రూల్ ఉంది. అమ్మతనం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా. అమ్మ ఎలా ఉండాలో చెప్పడానికి అసలు నువ్వు ఎవడ్రా అని రెచ్చిపోయింది. నా బర్త్ డే రోజు తిట్లు తినాలనుకుంటున్నావా అని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -