బలుపు అనుకోండి.. ఇంకా ఏదైన అనుకోండి.. జబర్దస్త్ వదలను : అనసూయ

787
Anchor Anasuya Bharadwaj Not Quitting Jabardasth Comedy Show
Anchor Anasuya Bharadwaj Not Quitting Jabardasth Comedy Show

జబర్దస్త్ కు యాంకర్ అనసూయ గుడ్ బై చెబుతుందని.. ఆమె ప్లేస్ లోకి యాంకర్ మంజుషా వస్తుందని.. ఇలాంటి రూమర్స్ ఈ మధ్యకాలంలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఇప్పుడు యాంకర్ అనసూయ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ” జబర్దస్త్ షో హిస్టరీ క్రియేట్ చేసింది. నేను పోయిన తరువాత కూడా జబర్దస్త్ షో ఉంటుంది. ఆ షోకి అనసూయ అనే యాంకర్ హైప్ తెచ్చిందని చరిత్రలో లిఖించబడింది. అనసూయ అంటే ఓ హిస్టరీ.

ప్రస్తుతం జబర్దస్త్‌లో నాగబాబు గారు లేరే అంటే.. అది ఆయన తీసుకున్న నిర్ణయమే. మల్లెమాల అందరికీ ఫ్యామిలీ లాంటిది. లాక్ డౌన్‌లో కూడా జబర్దస్త్ వాళ్లందర్నీ ఫ్యామిలీలా కేర్ చేస్తుంది. లాక్ డౌన్ ముందు.. లాక్ డౌన్ తరువాత మల్లెమాలలో ఏం తేడాలేదు. మా అంత మేము వద్దని వెళ్లిపోతే పోవాలి కానీ.. వారు మాత్రం తీసేయరు. నేను మాత్రం జబర్దస్త్ ని వదిలే ప్రసక్తే లేదు. చాలా మంది నేను జబర్దస్త్ ను వదిలేస్తున్నట్లు అనుకుంటూన్నారు. కానీ నేను జబర్దస్త్ షోకి క్వీన్‌ని. ఇది నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, బలుపు అనుకోండి.. ఏదేనా అనుకోండి.. నేనంటే పడనివాళ్లు బలుపు అని అనుకోవచ్చు.

నేనంటే ఇష్టపడేవాళ్లు హమ్మయ్య.. థాంక్యూ అని అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ జబర్దస్త్ అనే ఫ్యామిలీని నేను వదిలిపెట్టను. ఒకసరి ఎఫ్ 2, సుయ సుయ అనసూయ సాంగ్‌ షూటింగ్‌లకు వెళ్లాల్సి వస్తోంది. అప్పుడు జబర్దస్త్ కొన్ని ఎపిసోడ్స్ చేయలేదు. మళ్లీ వచ్చాను. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం నా బాధ్యత. ఒకవేళ నా ప్లేస్‌ని వేరే వాళ్లతో రీప్లేస్ చేసినా రెస్పెక్ట్ చేస్తా. కాని వచ్చే జనవరి 2021 వరకూ జబర్దస్త్ షెడ్యూల్ వచ్చేసింది. నో డౌట్ అప్పటి వరకూ నేనే జబర్దస్త్ యాంకర్’ అంటూ అనసూయ తనపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

Loading...