Friday, March 29, 2024
- Advertisement -

యాంకర్ మంజూష కారు చూస్తే దిమ్మతిరుగుతుంది!

- Advertisement -

టాలీవుడ్ లో చాలా మంది యాంకర్స్ ఉన్నప్పటికి యాంకర్ మంజూష మాత్రం తనకంటూ సపరేట్ ఫాలోయింగ్ సంపాధించుకుంది. ఈమె ఎక్కువగా స్టేజ్ షోస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఏ చిత్ర కార్యక్రమమైన ముందుగా మంజూషనే యాంకర్ గా వ్యవహరించమంటారు. అయితే తాజాగా మంజూష తన డ్రీమ్ ను పూర్తి చేసుకున్నారు. కార్ల కంపెనీలు ఎన్ని ఉన్న బీఎండబ్ల్యూ కొనాలంటే అంత ఈజీ కాదు.

కానీ యాంకర్ మంజూష తన కోరికను తీర్చుకున్నారు. తాను బీఎండబ్ల్యూ కారు కొన్నట్టు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. నాకు డ్రీమ్ కారు కొన్నాననే విషయాన్ని ఇంక నమ్మబుద్ది కావడం లేదు. భగవంతుడి దయవల్లే ఇది కుదిరింది. బిఎండబ్ల్యూ కారు అంటే నాకు ఎంతో ఇష్టం అని తన హ్యాపీనెస్ ను ఫేస్ బుక్ ద్వారా తెలిపింది. యాంకర్ మంజూష తన వాగ్దాటితో ఎంతో మంది సినీ ప్రముఖులను ఆకట్టుకున్నారు.

సినిమా గురించి చెప్పి క్రేజ్ పెంచడంలో మంజుషా సక్సెస్ అయింది. మంజూష తనకు ఇష్టమైన కారు కొనాలనే కలను సాకారం చేసుకోవడంపై నెటిజన్ల అభినందిస్తున్నారు. ఇటీవల సైరా, సాహో ప్రమోషన్స్ లో భాగంగా మంజూష చేసిన ఇంటర్వ్యూలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -