లైవ్ లో యాంకర్ ప్రదీప్.. ఆరోగ్యంపై క్లారిటీ..!

1632
anchor pradeep machiraju given clarity on his health in facebook live and says about his re entry
anchor pradeep machiraju given clarity on his health in facebook live and says about his re entry

యాంకర్ ప్రదీప్ చాలా రోజులుగా బుల్లితెరపై కనిపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. తనికి ఏదో అయిందని.. ఆరోగ్యం బాగాలేదని.. ఇలా రకరకల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు ప్రదీప్ వీటనిటికి ఓ క్లారిటీ ఇచ్చాడు. చాలా రోజులు ఇంట్లో ఉండటం వల్ల లైవ్ కి రావాలనిపించిందని ప్రదీప్ చెప్పాడు. కనిపించకుండా పోయినందుకు చాలా మంది మెసేజులు చేశారని చెప్పాడు.

కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఎవరికి రిప్లయ్ ఇవ్వలేకపోయానని చెప్పాడు. బుల్లితెరపై మళ్లీ ఎంట్రీ ఉంటుందని.. అందుకు సంబంధించిన వివరాలు వారం రోజుల్లో తెలియజేస్తానని చెప్పాడు. ఇంట్లో ఉంటే ఎలా టైం పాస్ అవుతుంది అనుకునేవాడిని.. కానీ మీరు పెట్టే మెసేజులతో మంచి టైం పాస్ అయ్యేది.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే యూ ట్యూబ్ వీడియోస్, హెడ్డింగులు చూసి నవ్వొచ్చేదని.. వాళ్లు క్రియేటివ్‌గా రాసిన కొన్ని కథలు చూసి నవ్వినవ్వి చచ్చిపోయామని చెప్పాడు ఈ యాంకర్.

క్షీణించిన ఆరోగ్యం, ఇంకేదో ఇంకేదో అంటూ రాయడంతో చాలా మందికి తెలియదు కదా ఇలాంటి వీడియోస్ చూసి వాళ్లు కంగారు పడ్డారని.. అందుకే ఇప్పుడు నిజం చెప్పడానికి వచ్చానని చెప్పాడు ప్రదీప్. తన కాలికి ప్రాక్చర్ కావడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపాడు. షూటింగ్ చేస్తున్నప్పుడు దెబ్బ తగలడంతో డాక్టర్లు సర్జరీ చేసి నిల్చోవద్దని చెప్పినట్లు తెలిపాడు ప్రదీప్. అందుకే బ్రేక్ తీసుకున్నట్లు తెలిపాడు. చేతికి అవుతే ఎలాగైన యాంకరింగ్ చేసేవాడినని.. కానీ కాలుకి కావడం వల్ల బ్రేక్ తీసుకున్నానని చెప్పాడు.

Loading...