Wednesday, April 24, 2024
- Advertisement -

కోరిన డబ్బు కంటే ఎక్కువ ఇచ్చి… ఒక రాత్రికి గడపమంటే..?

- Advertisement -

కురచ దుస్తుల్లో ఎక్స్ ట్రా జబర్దస్త్ తో అభిమానులను సంపాదించుకున్న హాట్ యాంకర్ రష్మి క్రిస్మస్ సందర్భంగా తన ఫ్యాన్సుతో సరదాగా చిట్ చాట్ చేసింది. రష్మిని కొందరు కొంటె ప్రశ్నలు అడిగితే, ఇంకొందరు డైరెక్టుగానే ఆ విషయాల గురించి అడిగేశారు. ఓ నెటిజన్ ఏకంగా హాయ్ రష్మి “మీకు ఎవరైనా మీరు కోరిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చి ఒక రాత్రికి తనతో గడపమని కోరితే ఏం చేస్తారు” ?. అంటూ మనసులోని మాటను నిర్మొహమాటంగా అడిగేశాడు. దీనికి ఏమాత్రం తడబడకుండా రష్మి అంతే నిర్మొహమాటంగా సమాధానం చెప్పేసింది. తాను కోరిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చి, తనతో ఓ రాత్రి గడపమంంటే… తన నిర్ణయం… అది అడిగిన వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. ఒకవేళ జబర్దస్త్ లోని అప్పారావు నుంచి అలాంటి ప్రపోజల్ వస్తే యాక్సెప్ట్ చేస్తావా ? అని మరో నెటిజన్ సూటిగా సుత్తిలేకుండా రష్మిని అడిగేశాడు. రష్మి కూడా అంతే సూటిగా ‘కుదరదు అని చెప్పేస్తా’..అంటూ ఓపెన్ గా ఎలాంటి దాపరికాలు లేకుండా తుంటరి ప్రశ్నలకు అంతే తుంటరిగా సమాధానమిచ్చింది.

తన ట్వట్టర్ ఖాతలో పేరు పక్కన ఉండే 27 అంకె తన బర్త్ డే అని, ఏప్రిల్ 27 తన పుట్టినరోజు కనుక అలా పెట్టుకున్నానని చెప్పింది. తనకు ఇష్టమైన ఫుడ్ పచ్చిపులుసు అని, ఇష్టమైన స్పాట్ షూటింగ్ లో లంచ్ బ్రేక్ అని చెప్పుకొచ్చింది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మార్పు తెస్తారని ఆశిస్తున్నానంది. రామ్ గోపాల్ వర్మతో అయినా, సుడిగాలి సుధీర్ తో అయినా స్క్రిప్ట్ నచ్చితేనే సినిమాలు చేస్తానంది. ఎనర్జిటిక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఢీ10 ఫినాలే లో చాలా సందడి చేశాడని తాను ఆ సందడిని ఎప్పటికీ మరిచిపోలేనంది. తనకు నచ్చిన నటి మాధురీ దీక్షిత్ అని చెప్పింది. భవిష్యత్ లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను తప్ప వ్యాపారాల జోలికి పోనంది రష్మి. మరి ఏప్రిల్ 27న బర్త్ డే అని చెప్పావు కదా…ఏజ్ ఎంతో ఎందుకు చెప్పలేదు ? నీ వయసెంత ? అని మరో అభిమాని అగడడంతో ఆ ఒక్కటీ అడక్కు. నా వయసు, పెళ్లి గురించి ఎవరైనా అడిగితే నాకు నచ్చదు..అంటూ చిట్ చాట్ చేసింది రష్మి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -