Saturday, April 20, 2024
- Advertisement -

గూండాలను పంపి భయపెడుతుండు : యాంకర్ రవి కేసు..!

- Advertisement -

యాంకర్ రవికి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే చాలా షోస్ లో యాంకరింగ్ చేశాడు. ప్రధానంగా పటాస్ తో బాగా క్రేజ్ సంపాధించుకున్నాడు. ఇక అలానే మూవీ ఫంక్షన్స్ కి కూడా రవి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తన దగ్గర అప్పుగా డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా గూండాలను పంపి బెదిరిస్తున్నాడంటూ సందీప్ అనే వ్యక్తిపై కూకట్‌పల్లి పోలీసులకు నిన్న సాయంత్రం యాంకర్ రవి ఫిర్యాదు చేశాడు.

సినీ పరిశ్రమకు చెందిన సందీప్ తన వద్ద రూ.45 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, కొన్ని రోజుల తర్వాత కొంత డబ్బులు వెనక్కి ఇచ్చాడని, ఇంకా కొంత సొమ్ము రావాల్సి ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రవి పేర్కొన్నాడు. అయితే మిగతా డబ్బులు అడుగుతుంటే ఇవ్వకపోగా.. బెదిరిస్తున్నాడని ఆరోపించాడు.

తాను ఎక్కడికి వెళ్లినా సందీప్ మనుషులు అనుసరిస్తూ బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. అయితే తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్ వారిని కూడా ఇలాగే మోసం చేశాడని తెలిసిందన్నాడు. రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -