Saturday, April 20, 2024
- Advertisement -

యాంకర్ రవి బిగ్ బాస్ లో ఉన్న శ్రీముఖి గురించి మర్చిపోయాడా

- Advertisement -

పటాస్ లో రవి శ్రీముఖిల అల్లరి, ఎనర్జీ, పంచులు, గోల గోల ఎంతలా ఉంటుందో తెలుసు కదా.. కానీ శ్రీముఖిని ప్రస్థుతం రవి మర్చిపోయాడు అనుకుంట. ముందు రవి లాస్య , తరువాత శ్రీముఖి రవి, ఇప్పుడు రవి వర్షిణి.. ఒకరు రాగానే ఒకర్ని మర్చిపోయి కొత్తగా స్టార్ట్ చేసేస్తాడు రవి.

శ్రీముఖి చాలా షోలు చేసినా కూడా పటాస్ లో తనకి వచ్చిన గుర్తింపు వేరు. దాదాపు 2 సంవత్సరాల పాటు ఏకదాటిగా నడిచిన షో పటాస్, ఇప్పటికీ నడుస్తుంది కానీ శ్రీముఖి లేకుండా వర్షిణితో చేస్తున్నాడు రవి. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టే నెలరోజుల ముందు నుండి ఏ షోలు చెయ్యకూడదు సెలబ్రిటీలు. దాని ప్రకారమే శ్రీముఖి పటాస్ నిర్వాహకుల ఆమోదంతోనే పటాస్ నుండి తాత్కాలికంగా తప్పుకుంది. చాలా హైప్ లో ఉన్న కెరీర్ ని కొన్ని రోజులు ప్రక్కన పెట్టి ఒక ఎక్స్పీరియన్స్ కోసం శ్రీముఖి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిందని మనకు తెలుసు.

కానీ శ్రీముఖి చిల్లర చేష్టలతో బిగ్ బాస్ ఇంట్లో ఎవరికీ దగ్గర కాలేకపోయ్యింది, అభిమానుల ప్రేమను దక్కించుకోలేకపోయింది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంట్లోనే కాదు బయట కూడా శ్రీముఖి తన పేరును చెడకొట్టుకుంటుందని అర్థం అవుతుంది. బయట ఉన్నపుడు తన స్నేహితుడు , కొలిగ్ అయిన రవి కూడా తన పేరును ప్రస్థావించడానికి ఇష్టపడటం లేదు.

మొన్న అభిమానుల ప్రశ్నలకు జవాబులు చెప్తూ బిగ్ బాస్ ఇంట్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అనే ప్రశ్నకు అలీ అని సమాధానం చెప్పాడు. బిగ్ బాస్ చూడటం కుదరట్లేదు కానీ బాబా మాస్టర్, వరుణ్ బాగా ఆడుతున్నారని విన్నానని చెప్పాడు. ఎన్నో రోజులు కలిసి పని చేసిన శ్రీముఖి పేరు మాట వరసకి కూడా చెప్పకపోవడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -