Thursday, April 25, 2024
- Advertisement -

యాంకర్ రవి కారు యాక్సిడెంట్.. ఫైర్ అయిన రవి..!

- Advertisement -

తెలుగు బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు యాంక రవి. యాంకరింగ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి సినిమాల్లోనూ నటించాడు. అంతేకాదు ఎన్నో సినిమా ఫంక్షన్స్ కి హోస్ట్ గా కూడా చేశాడు. దాంతో రవి ఎప్పుడు బిజీగానే ఉంటాడు. తాజాగా రవి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవికి బుల్లితెరపై ఎంత పేరు వచ్చిందో అంతకంటే ఎక్కువ అతడ్ని వివాదాలు చుట్టుముట్టాయి.

ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికే చాలా సార్లు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని, చివాట్లు తిని మళ్ళీ క్షమాపణలు కోరాడు. మరీ ముఖ్యంగా ఓ సినిమా ఫంక్షన్‌లో జరిగిన సంఘటన అతడి కెరీర్‌కు మచ్చగా మిగిలిపోయింది. ఇక ఇటీవలే పటాస్ షో నుంచి బయటకు వచ్చాడు. శనివారం సాయంత్రం యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌ నగరంలోని మూసాపేట్ నుంచి బంజారాహిల్స్ వెళుతుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రవి కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. కానీ, ఎవరకీ గాయాలు కాలేదు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారును డ్రైవర్ నడుపుతున్నాడు.

ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రతి విషయంను వీడియో తీయించాడు రవి. వ్యాన్ డైవర్‌తో మాట్లాడడం, పోలీసులకు ఫోన్ చేయడం కూడా అందులో కనిపించాయి. తర్వాత రవి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మాట్లాడుతూ.. “ఇలాంటి తాగుబోతు డ్రైవర్లే రెస్ట్ తీసుకోడానికి ఆపుతారు. ఆ సమయంలో ల** రేప్‌లు చేస్తున్నారు” అంటూ రవి సీరియస్ అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -