Friday, April 19, 2024
- Advertisement -

రష్మీ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన శిల్పా చక్రవర్తి..!

- Advertisement -

తన యాంకరింగ్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది శిల్పా చక్రవర్తి. అయితే ఎక్కువ కాలం ఆమె యాంకర్ గా నిలదొక్కుకోలేకపోయింది. గతేడాది ’బిగ్ బాస్’ మూడో సీజన్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీచ్చిన శిల్పా.. ఈ షోతో అయిన మళ్లీ గుర్తింపు తెచ్చుకుని ఫాంలోకి రావాలని ఆశపడింది. కానీ ఈమెను హౌస్ లో ఏ కంటెస్టెంట్ కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఏక్ నిరంజన్ ని అని ఫీలవుతూ గేమ్ పై ఫోకస్ చేయలేకపోయింది.

దాంతో ఆమె రెండువారాలకు మించి బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయింది. అదే విషయాన్ని ఈమె కూడా అనేక సార్లు చెప్పుకొచ్చింది. ఈ విషయం పక్కన పెడితే.. చాలా రోజులుగా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న శిల్పా.. ఇటీవలే ఓ ఇంటర్వూలో పలు విషయాలు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా యాంకర్ రష్మీ గురించి ఆసక్తికరమైన విషయాల్ని చెప్పింది. శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ.. “నేను రష్మీ ఓకే సారి కెరీర్ ను స్టార్ట్ చేశాం. తెలుగులో ఆమె పెద్దగా సక్సెస్ కాలేదు.

బాహుశా అప్పుడు ఆమెకు తెలుగు రాకపోవడం వల్లేమో. దాంతో తమిళ్, మలయాళం.. సినిమాల్లో నటించింది. బాగా స్ట్రగుల్ అయ్యింది. డ్యాన్స్.. రియాలిటీ షోలు కూడా చేసింది. సినిమాల విషయంలో రష్మీకి సరైన క్యారెక్టర్ పడలేదు. అందుకే అక్కడ సక్సెస్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. కానీ ‘జబర్దస్త్’ షోతో బాగా సక్సెస్ అయ్యింది. ఐ యామ్ హ్యాపి.. మొత్తానికి తను సక్సెస్ అయ్యింది. ఆమె చాలా అందంగా ఉంటుంది కూడా” అంటూ రష్మీ గురించి చెప్పుకొచ్చింది శిల్పా చక్రవర్తి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -