Friday, March 29, 2024
- Advertisement -

పెళ్లి చేసుకోబోతున్నా.. అందుకే షోస్ చేయట్లేదు : శ్రీముఖి

- Advertisement -

బుల్లితెర రాములమ్మ శ్రీముఖికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఉన్న టాప్ యాంకర్స్ లిస్ట్ లో శ్రీముఖి కూడా ఉంటుంది. కుర్రకారుని ఈమె బాగా ఆకర్షిస్తుంది. ‘పటాస్’ ప్రోగ్రామ్ తో యూత్ కు దగ్గరైన శ్రీముఖి.. ‘బిగ్ బాస్3’ రియాలిటీ షో ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా దగ్గరయింది. ఈ షో తో శ్రీముఖి క్రేజ్ మరో లెవల్ కి వెళ్లింది.

నిజానికి బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ గా శ్రీముఖి నిలుస్తోందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. ఈ విషయం ప్రక్కన పెడితే.. ప్రస్తుతం బిజీ యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి .. సడన్ గా తాను పెళ్లికి రెడీ అవుతున్నట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇటీవల సుమ హోస్ట్ చేస్తున్న ఓ షోలో పాల్గొన్న శ్రీముఖి.. ‘2 ఏళ్ళల్లో పెళ్లి చేసుకుని.. ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ఇచ్చేస్తా” అని చెప్పింది. శ్రీముఖి చేసిన ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

మంచి క్రేజ్ ఉన్నప్పుడే మర్యాద పూర్వకంగా రిటైర్మెంట్ ఇవ్వడం ఉత్తమం అని గతంలో చాలా మంది హీరోయిన్స్ చెప్పారు. బహుశా శ్రీముఖి మనసులో కూడా అదే ఉందేమో..! అయినా ఇంకా రెండేళ్ల తరువాత కదా శ్రీముఖి పెళ్లి చేసుకుని రిటైర్ అయ్యేది. అప్పటివరకూ తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో అలరిస్తూనే ఉంటుంది లెండి..! ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్మెన్'(2016) వంటి చిత్రాల్లో కూడా శ్రీముఖి నటించిన విషయం మనకు తెలిసిందే.

రామ్ చరణ్ వాడే వాచ్ ధర ఎంతో తెలుసా ?

నీ బతుకెంత అని తిట్టావ్.. దేవుడున్నాడ్రా : అభిరామ్ శ్రీరెడ్డి ఫైర్

పవన్ బర్త్ డే రోజున సర్ ఫ్రైజ్ ఇదే.. ఫ్యాన్స్ కి పండగ..!

సిగ్గులేని జన్మ అంటూ.. సుధీర్ ని తిట్టిన రోజా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -