Friday, April 19, 2024
- Advertisement -

బిగ్ బాస్ కెళ్తున్న యాంకర్ లాస్య కాదు, మరెవరో తెలుసా?

- Advertisement -

బిగ్ బాస్ టీవీ షో కి సంబందించిన మూడో సీజన్ కి సంబందించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. రేపో ఎల్లుండో ఈ షో ని నాగార్జున అధికారికం గా హోస్ట్ చేయనున్నారు అనే విషయం మీద క్లారిటీ ఇవ్వనున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ షో లో కంటెస్టెంట్స్ గా ఈ సారి ఎవరు ఉంటారు అనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే బిగ్ బాస్ నిర్వాహకుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ షో లో ఈ సారి ఒక తెలుగు యాంకర్ ఉండబోతుంది. ఈ విషయం తెలిసిన చాలా మంది మీడియా వాళ్ళు ఆ యాంకర్ లాస్య అనుకోని వార్తలు ప్రచురించారు. కానీ అసలు విషయానికి వస్తే అసలు ఈ షో లో ఉండబోతున్న తెలుగు యాంకర్ లాస్య కాదట.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు. ఈ షో లో ఉండబోతున్న ఆ తెలుగు యాంకర్ శ్రీముఖి అని తెలుస్తుంది. శ్రీముఖి ని అందరి కన్నా ముందే బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయ్యారట. శ్రీముఖి కూడా అందుకు సుముఖత చూపిస్తుంది అని తెలుస్తోంది. ఇక ఈ షో కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలవనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -