Thursday, March 28, 2024
- Advertisement -

యాంకర్ ఉదయభాను గురించి షాకింగ్ నిజాలు..!

- Advertisement -

యాంకర్ ఉదయభాను.. ఒక్కప్పుడు స్టార్ యాంకర్. ఈమె గురించి తెలియని వారు ఉండరు. కాగా ఈమె ఓ ఖరీదైన వస్తువు కొని వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏంటా వస్తువు? దాని ఖరీదు ఎంత? వివరాల్లోకి పోతే.. ఒకానొక టైంలో బుల్లితెరపై మాటల సందడి చేసి హాట్ యాంకర్‌గా మంచి పేరు సంపాధించుకుంది ఉదయభాను. ఆమె హొస్ట్ చేసిన “డాన్స్ బేబీ డాన్స్, సాహసం చేయరా డింభకా” లాంటి టీవీ షోస్ ప్రేక్షకులకు అమాంత ఆకట్టుకున్నాయి.

దీంతో బుల్లితెర ఆడియన్స్ గుండెల్లో అలా స్థిరపడిపోయింది ఉదయభాను. బుల్లితెరపై చేస్తూనే వెండితెరపై కూడా కొన్ని సినిమాలు చేసింది. తర్వాత విజయ్ కుమార్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఉదయభాను.. కవల పిల్లలకు జన్మనిచ్చి.. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఇంటికే పరిమితమై పోయింది. తాజాగా ఓ ఖరీదైన బెంజ్ కారు కొన్న ఉదయభాను.. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చింది.

ఉదయభాను ఫ్యామిలీ అంతా నిండుగా కనిపిస్తుండటంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇకపోతే ఇటీవలే బుల్లితెరపైకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను.. క్రమంగా ఫామ్ లోకి వస్తోంది. ‘కళ్యాణ లక్ష్మి’ అనే మహిళా కార్యక్రమానికి యాంకర్‌గా, ‘జూలకటక’ అనే కామెడీ షోకు జడ్జిగా పనిచేసి.. ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ అనే కామెడీ ప్రొగ్రామ్ యాంకర్‌గా కొనసాగుతోంది. అనే కొన్ని ఈవెంట్స్ కి కూడా హోస్ట్ గా చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -